ఆ రీమేక్ ఎవరైనా చేస్తే వెంటనే డేట్స్ ఇస్తా..అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ కి తాజాగా ఓ కొత్త కోరిక పుట్టుకొచ్చింది. అది దేవానంద్ నటించిన గైడ్ చిత్రం రీమేక్ లో నటించాలని. ఈ విషయం ఆయన మీడియాకు చెపుతూ..నాకు దేవానంద్ యాక్ట్ చేసిన సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన నటించిన చిత్రాల్లో గైడ్ నా ఫేవరెట్ ఫిలిం. ఆ చిత్రాన్ని ఎవరైనా రీమేక్ చేస్తే నేను చేద్దామనుకుంటున్నాను. వెంటనే నా డేట్స్ వారికి ఇస్తాను. అంతేగాదు అవకాశముంటే ఆయన చేసిన అన్ని చిత్రాల రీమేక్స్‌లో చేయాలనుంది అన్నారు అమీర్ ఖాన్. దేవానంద్ నటించిన హమ్ దోనో (1961)కి ఇటీవల కలర్ లోకి మార్చి విడుదల చేసారు. దేవానంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ కలర్‌ఫుల్ హమ్ దోనో ప్రీమియర్ షోను అమీర్ ఖాన్ హాజరై ఇలా మాట్లాడారు. మరి ఎవరైనా గైడ్ రీమేక్ చేయటానికి రెడీ అవుతారో కారో చూడాలి.


Click it and Unblock the Notifications











