For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగులో సంచలనానికి ‘ఆనందం’.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రేమమ్ హీరో అతిథి పాత్రలో..

  By Rajababu
  |

  ప్ర‌తి క్ష‌ణాన్ని ఆనందంగా గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల్లోనూ ఉంటుంది. జీవితంలో మిగిలిన రోజుల సంగ‌తి ఎలా ఉన్నా.. కాలేజీలో, క్యాంప‌స్‌లో స‌ర‌దాగా గ‌డిపే క్ష‌ణాలు మాత్రం ఆనందానికి కేరాఫ్ అడ్ర‌స్‌లు. ఓ వైపు చ‌దువు అనే బాధ్య‌త ఉన్నా... భ‌విష్య‌త్తు గురించి ఆలోచ‌న‌లు వెంటాడుతున్నా... చుట్టూ స్నేహితులు, అంద‌మైన క‌ల‌లు ఆనందాల లోకంలో విహ‌రింప‌జేస్తాయి. అలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కాలేజ్ డేస్‌లో ఆస్వాదించిన ఆనందాన్ని మ‌ర‌లా ఓ సారి తెర‌మీద చూపించ‌డానికి సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎత్త‌రి గురురాజ్‌ స‌న్నాహాలు చేస్తున్నారు.

   నివీన్ పౌలీ అతిధి పాత్రలో

  నివీన్ పౌలీ అతిధి పాత్రలో

  మ‌ల‌యాళంలో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన `ఆనందం` చిత్రాన్ని అదే పేరుతో ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ నెల 23న అందించ‌నున్నారు. మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ చిత్రానికి గ‌ణేశ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేర‌ళ టాప్ హీరో `ప్రేమ‌మ్` ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన న‌టీన‌టులంద‌రూ దాదాపుగా కొత్త‌వారే. తెలుగులో అనువాద‌మ‌వుతోన్న `ఆనందం` చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్‌బీ రాజు ,రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు.

  పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి

  పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి

  `ఆనందం` గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ ``మా `ఆనందం` అనువాద‌ ప‌నులు దాదాపుగా పూర్త‌య్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ నెల 17న పాట‌ల వేడుక‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తాం. కేర‌ళ‌లో టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌లో ఒక‌రైన స‌చిన్ వారియ‌ర్ స్వ‌రాల‌కు వ‌న‌మాలి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు.

  హ్యాపీడేస్ తరహాలోనే

  హ్యాపీడేస్ తరహాలోనే

  `హ్యాపీడేస్‌` పాట‌ల త‌ర‌హాలోనే మా పాట‌లు కూడా త‌ప్ప‌కుండా చార్ట్ బ‌స్ట‌ర్ అవుతాయి. యువ‌త చెవుల్లో మారుమోగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ నెల 23న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. కేర‌ళ‌లో నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చుకు ఐదింత‌లు మొత్తాన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాబ‌ట్ట‌గ‌లిగిందంటేనే ఈ క‌థ‌కున్న ప‌వ‌ర్‌ని అర్థం చేసుకోవ‌చ్చు అని అన్నారు.

  మలయాళానికి ధీటుగా

  మలయాళానికి ధీటుగా

  తెలుగులోనూ అందుకు ధీటుగా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప‌లువురు ఈ సినిమాను రీమేక్ చేస్తామ‌ని, రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగిన‌ప్ప‌టికీ ఆ న‌మ్మ‌కంతోనే మేం అనువాదం చేస్తున్నాం. ఎక్క‌డా మ‌ల‌యాళ సినిమా అని అనిపించ‌దు. కాలేజీ అనుభ‌వాలు అనేవి ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఒకే ర‌కంగా ఉంటాయి. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా జ్ఞాప‌కాలుగా మిగిలి ఉంటాయి అని ఎత్తరి గురురాజ్ పేర్కొన్నారు.

   మూడు జంటల ప్రేమకథ..

  మూడు జంటల ప్రేమకథ..

  ఆనందం సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ చ‌దువుకున్న‌ రోజులు గుర్తుకొస్తాయి. ఒక ఇండ‌స్ట్రియ‌ల్ టూర్ నాలుగు రోజులు జ‌రిగితే అక్క‌డ మూడు ప్రేమ జంట‌ల క‌థే మా సినిమా. త‌ప్ప‌కుండా ప్ర‌తి గుండెనూ త‌డుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని గురురాజ్ వెల్లడించారు.

  నటీనటులు

  నటీనటులు

  అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధి మ‌హాజ‌న‌క‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి మ‌రిక‌ర్‌, నివిన్ పాల్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు.

   సాంకేతిక నిపుణులు

  సాంకేతిక నిపుణులు

  మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర రెడ్డి, పాట‌లు: వ‌న‌మాలి, సంగీతం: స‌చిన్ వారియ‌ర్‌, కెమెరా: ఆనంద్‌. ఇ. చంద్ర‌న్‌, సహ నిర్మాతలు : వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్‌బీ రాజు ,రవి వర్మ చిలువూరి , ద‌ర్శ‌క‌త్వం: గ‌ణేశ్ రాజ్‌, స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌. సీతారామ‌రాజు.

  English summary
  Aanandam is a 2016 romantic comedy film written and directed by Ganesh Raj in his directorial debut. A Guru Raj producing this movie in as Telugu dubbing for Malayalam. V Venkateshwara Rao, VRB Raju, Ravi Varma Ch are the co producers for the movie. Aanandam follows the life of 7 second year engineering students as they embark on their very first college tour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X