కూతురు పుట్టిన రోజు ఏర్పాట్లు గురించి ఐశ్వర్య
ముంబై: ఐశ్వర్య, అభిషేక్‌ల కూతురు, అమితాబ్ బచ్చన్ మనువరాలు చిన్నారి ఆరాధ్య నవంబర్ 16న మొదటి పుట్టిన రోజు జరుపుకోనుంది. పుట్టినప్పటి నుంచి ఆరాధ్యను మీడియా కంటపడకుండా బచ్చన్ కుటుంబం దాచుకుంటూ వస్తోంది. పలు సందర్భాల్లో కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడినప్పటి కీ, ఐశ్వర్య పుట్టిన రోజున ఆమెకు ఫ్రెంచ్ గౌరవ పురస్కారం ఇచ్చిన సభలో పలు కెమెరాలు ఆరాధ్యను క్లిక్‌మనిపించాయి.
''సమయం ఇట్టే గడిచిపోతోంది. ఆరాధ్య పుట్టినరోజు వచ్చేసింది. తన పుట్టినరోజు మా వ్యక్తిగతమైంది. మా కుటుంబసభ్యులతో మధ్య జరుగుతుంది'' అని, ఐశ్వర్య మీడియాతో అన్నారు. తన కూతురు పుట్టిన తరువాత మొదటి దీపావళి పండుగను కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య జరుపుకుందని ఆమె తెలిపారు.
ఆరాధ్య పుట్టినరోజు గురించి అభిషేక్ మాట్లాడుతూ కూతురు మొదటి పుట్టినరోజు తల్లికి చాలా ముఖ్యమైందని, వాళ్లిద్దరూ కలిసి చాలా సమయం గడపాలనుకుంటారని అన్నారు. గత నెల 11న అమితాబ్ 70వ పుట్టినరోజున బచ్చన్ కుటుంబం ఏర్పాటు చేసిన పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు, దక్షిణాది సినీ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











