కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య రాయ్ ఔటింగ్ (ఫోటోలు)
ముంబై: అందాల తార ఐశ్వర్య రాయ్ తన 16 నెలల వయసు గల కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. వీరు విదేశాల్లో హాలిడే ట్రిప్ గడిపి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ చాలా బరువు తగ్గి కనిపించింది.
ఐశ్వర్య రాయ్ నీలం రంగు వెస్టర్న్ ఔట్ ఫిట్స్ లో దర్శనం ఇవ్వగా... బేబీ ఆరాధ్య కలర్ ఫుల్ ఫ్రాక్‌లో ఎంతో ముద్దుగా కనిపించింది. అమ్మ భుజాలపై ఆరాధ్య పవళిస్తూ ఎంతో క్యూట్ గా కనిపించింది. ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు రక్షణగా నిలుస్తూ భర్తగా, తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వహించారు.
అందుకు సంబంధించని దృశ్యాలను క్రింద స్లైడ్ షోలో వీక్షించ వచ్చు. ఇతర దేశాలకు విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో వీరు మీడియా కంట పడ్డారు. మరో వైపు ఐశ్వర్య రాయ్ చాలా బరువు తగ్గి మళ్లీ మునుపటి రూపంలో ఎంతో అందంగా కనిపించారు. దీన్ని బట్టి ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఎయిర్ పోర్టులో మీడియాకు తారస పడిన ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య.

అమ్మ భుజాలపై పవళిస్తున్న ఆరాధ్య.

ఎంతో అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య రాయ్.

ఆరాధ్య కలర్ ఫుల్ గౌను ఎంతో అందంగా ఉంది కదూ..

మీడియా కనపడగానే స్మైల్ ఇస్తున్న అభిషేక్ బచ్చన్.


Click it and Unblock the Notifications











