ఫోటో : అమ్మ ఐష్‌తో కలిసి ఆరాధ్య కాన్స్
కాన్స్ : అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఆరాధ్య కంటే తనకు ఏదీ ముఖ్యంగా కాదు అనే రీతిలోనే సాగుతోంది ఐశ్వర్య. తల్లిగా ఎంతో సంతృప్తికర జీవితం సాగిస్తోంది. ఎక్కడికెళ్లినా ఆరాధ్యను వెంట తీసుకునే వెలుతోంది. తాజాగా 66వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఐశ్వర్య ఆరాధ్యను కూడా తన వెంట తీసుకొచ్చింది.
కాన్స్‌లో బిజీ మరియు తీవ్రమైన షెడ్యూల్ మధ్యలోనూ తల్లిగా తన బాధ్యత మరువడం లేదు. అందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యమే నిదర్శనం. కాన్స్‌లో హోటల్ రూమ్‌లో ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో గడుపుతున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో బేబీ ఆరాధ్య ఎంతో క్యూట్‌గా ఉంది కదూ..., 18 నెలల వయసుగల ఆరాధ్యను చూస్తుంటే ఎంతో ఫాస్ట్‌గా ఎదుగుతుందనిపిస్తుంది కూదూ. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్య, ఆరాధ్యతో పాటు వృందా రాయ్ కూడా వీరి వెంట ఉన్నారు. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య మదర్.


Click it and Unblock the Notifications












