పెళ్లి చేసుకున్న ఆర్తి అగర్వాల్
హీరో తరుణ్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకుంది తరుణ్ ను మాత్రం కాదు. ఒక ఎన్నారైని. తరుణ్ ప్రేమాయణం నేపథ్యంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఆర్తి అగర్వాల్ బుధవారం హైదరాబాద్ నగరంలోని రాణిగంజ్ ఆర్యసమాజ్ లో ఈ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మద్యాహ్నం ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి మీడియాలో ప్రాధాన్యం ఇవ్వవద్దని, ఇది అరెంజ్డ్ మ్యారెజ్ అని ఆర్తీ అగర్వాల్ తండ్రి మీడియాకు చెప్పారు. అంతేకాకుండా పెళ్లి జరుగుతున్న ఆర్యసమాజ్ మందిర్ లోకి మీడియాను రాకుండా చర్యలు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications