మళ్ళీ ఆమెరికాలో ఆర్తీ అగర్వాల్
ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించిన ఆర్తీ అగర్వాల్ గ్రహస్ధితి బాగుండకపోవడంతో ఒక పిరికి వ్యక్తిని ప్రేమించి ఇబ్బందుల్లో పడిపోయింది. కొన్ని నెలల క్రితం మెట్ల మీది నుంచి కింద పడి తీవ్రంగా గాయపడిన ఆర్తి అమెరికాలో చికిత్స పొంది, విశ్రాంతి తీసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆమె హాస్య నటుడు సునీల్ సరసన అందాల రాముడు సినిమాలో నటిస్తోంది. ఆర్తి ఆస్పత్రి పాలు కావడంతో ఆ సినిమా నిర్మాణం బాగా ఆలస్యమైంది. ఆమె ఇటీవల హైదరాబాద్ వచ్చి ఆ సినిమాలో పెండింగ్ సీన్లలో నటించింది. ఈ సినిమా జులైలో విడుదల కానుంది. ఆర్తీ అగర్వాల్ తాను పుట్టి పెరిగిన ఆమెరికాకు తిరిగి వెళ్ళిపోవడం వెనుక అనేక కథలు విన్పిస్తున్నాయి. ఆమె శాశ్వతంగా సినిమా రంగానికి గుడ్ చెప్పిందని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications