లావు తగ్గా..రండి
ఒళ్ళు పెంచి సిలెండర్ అని పిలిపించుకునే ఆర్తి అగర్వాల్ ఈ మధ్య పెళ్ళయి తెరమరుగైంది. అయితే ఇప్పుడు మళ్ళి నేనున్నాను అంటూ మీడియా సమావేశం పెట్టి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అంతేగాక హీరోయిన్‌గానే చేయాలనుకుంటున్నా..వేరే పాత్రలు ఆఫర్స్ వద్దంటూ క్లియర్ గా చెప్తోంది. ఎందుకు తగ్గాల్సి వచ్చిందానికి 'గోరింటాకు'లో బాగా లావుగా ఉన్నాననే కామెంట్స్ వినిపించాయ్. అప్పట్నించీ బరువు తగ్గడానికి కృషి చేస్తూనే ఉన్నా. 15 కిలోల పైగా బరువు తగ్గానని చెప్పిందామె.
ఇక తన భర్త గురించి చెబుతూ మావారు ఉజ్వల్ కుమార్ అమెరికాలో మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో సీనియర్ అఫిషియల్. ఆయన వెరీ సపోర్టివ్. మా మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తోంది. చేయడానికి నాకు పనేమీ లేకపోవడంతో బోర్ కొడుతోంది. చాలామంది అడుగుతున్నారు 'ఆర్తీ ఎప్పుడొస్తున్నావ్?' అని. అందుకే మళ్లీ సినిమాల్లో చేయాలనిపించింది. నా కోరిక చెప్పగానే ఆయన సరేనన్నారు. అందుకే మళ్లీ హైదరాబాద్ వచ్చానంటోంది.
అలాగే ఆమెకు ఇంకా హీరోయిన్ గానే చేయాలని ఉంది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'మిసెస్ అండ్ మిస్టర్ అయ్యర్' లాంటి సినిమాలు చేయాలనుందని చెప్తోంది. 'ఇంద్ర'లో చేసినటువంటి పవర్‌ఫుల్ లేడీ పాత్రలంటే ఇష్టం.'గోరింటాకు'లో బాగా లావుగా ఉన్నాననే కామెంట్స్ వినిపించాయ్. అప్పట్నించీ బరువు తగ్గడానికి కృషి చేస్తూనే ఉన్నా. దాదాపు 15 కిలోల బరువు తగ్గా. ఆహార నియమాలు పాటిస్తున్నా. నూనె వస్తువులు, పెరుగు బాగా తగ్గించేశా. ఎక్కువగా పండ్లు తీసుకుంటున్నా. యోగా, ఎక్సర్‌సైజులు చేస్తున్నాఅంటోంది. మరి లావు తగ్గానంటోంది కాబట్టి దర్శక,నిర్మాతలు ఓ లుక్కేస్తే సరి.


Click it and Unblock the Notifications











