ఆర్తి ఆ డైరక్టర్ తోనూ...
ఆర్తి అగర్వాల్ కొత్త చిత్రానికి నీలవేణి అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ముమైత్ తో మైసమ్మ ఐపియస్ తీసిన భరత్ పారేపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నవలా రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు డైలాగులు రాస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్.జి.ఆర్ కంబైన్స్ వారు నిర్మిస్తున్నారు. ముకుల్ దేవ్ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెండ్ అని తెలుస్తోంది. ఇక భరత్ పారేపల్లి వరస పెట్టి ఫ్లాపులిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్తి అగర్వాల్ మరో రచయిత, దర్శకుడు అయిన పోసాని కృష్ణ మురళి చిత్రంలోనూ నటించనుంది. తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ఇచ్చి స్టార్ గా వెలిగిన ఆర్తి ఇలాంటి సినిమాల్లో నటించటం బాధాకరమేనంటున్నారు.
More from Filmibeat
neelaveni aarthi agarwal mumaith misamma bharath ganapati rao mukul dev ఆర్తి అగర్వాల్ నీలవేణి ముమైత్ మైసమ్మ ఐపియస్ భరత్ పారేపల్లి ముకుల్ దేవ్


Click it and Unblock the Notifications











