ఆర్తి అగర్వాల్ మళ్ళీ మొదలెట్టింది

By Staff

Aarthi Agarwal
నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత తరుణ్ తో ప్రేమాయణం వంటి వాటితో వెనకపడింది. ఆ తర్వాత భారీగా ఒళ్ళు పెంచి అవకాశాలు లేక..మరో ప్రక్క విఫలమైన ప్రేమకథతో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఈ ముధ్దుగుమ్మ అనంతరం బుద్దిగా తలవొంచుకుని పెళ్ళి చేసుకుంది. అయితే సినిమా మళ్ళి గుర్తుకు వచ్చిందో పాత పరిచయాలు వెంబడించాయో గాని మళ్ళీ హైదరాబాద్ వచ్చి నేను మళ్ళీ రెడీ అని మీడియా మీట్ పెట్టి మరీ చెప్పింది. అంతేగాక తాను ఒళ్ళు తగ్గించి మునపటి గ్లామర్ తెచ్చుకున్నానంటూ స్టిల్స్ ఇచ్చింది. ఇది చూసి ఓ నిర్మాణ సంస్దవారు హీరోయిన్ వేషం ఇస్తానంటూ ముందుకొచ్చారు.

ఆలిండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సిహెచ్‌. సుధాకరబాబు తన పదవ చిత్రం నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథాంశంతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెల్లడిస్తూ' తెలుగులో రీ ఎంట్రీ అవుతున్న ఆర్తీ అగర్వాల్‌ తను ఇంతవరకూ పోషించిన పాత్రలకు భిన్నమైన కేరెక్టర్‌ను ఈ చిత్రంలో చేస్తోంది.

రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకునే ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌లో ప్రారంభమవుతుంది. హైదరాబాదు, చెన్నైలలో జరిగే సింగిల్‌ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. సినిమాలో 5 ఫైట్లు ఉంటాయి. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సందర్భంగా ఆర్తీ అగర్వాల్‌ మాట్లాడుతూ 'దర్శకుడు వి.వి.ప్రసాద్‌ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది.

నాలుగైదు ఆఫర్లు వచ్చినప్పటికీ నా రీ ఎంట్రీకి ఇదే సరైన స్క్రిప్ట్‌ అని భావించి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఇంతవరకూ నేను చేయని పాత్రను ఇందులో చేస్తున్నాను' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: టి.మోహన్‌రెడ్డి (యు.ఎస్‌.ఎ.), నిర్మాత: సిహెచ్‌.సుధాకరబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.ప్రసాద్‌. అదీ సంగతి మళ్ళీ ఆర్తి మొదలెట్టింది. ఇక రెగ్యులర్ గా తెరను పలకరిస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X