శాండీ తుఫాన్ లో ఆర్తి అగర్వాల్

By Srikanya

హైదరాబాద్: అమెరికాలో శాండీ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజెర్సీతో పాటు.. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, ఫిలడెల్ఫియా రాష్ట్రాలు ఈ భీకర తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాయి. న్యూయార్క్‌ సిటీ సగానికి పైగా నీటమునిగింది. కుండపోత వర్షాలతోపాటు.. ఎగసిపడుతున్న భారీ అలల కారణంగా.. సబ్‌వేలలోకి సైతం నీరు చేరింది. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలంతా ప్రాణభయంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.

ఈ నేపధ్యంలో మన తెలుగు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ..శాండి తుఫానులో చిక్కుకుందనే వార్త అబిమానులను కలవరపెడుతోంది. అయితే శాండీ ఎఫెక్టు తో ఆర్తికి పెద్దగా నష్టమేమీ జరగలేదని సమాచారం. ఆమె బస చేస్తున్న మోటల్ తుఫాను తాడికికి చిక్కుకుంది. అక్కడ నుంచి అమెరికా పోలీసులు ఆర్తిని ఖాళీ చేయించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా..ప్రస్తుతం ఆమెను అమెరికా న్యూ జర్శీలో గల ఓ సీనియర్ సిటిజన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతోంది.

అమెరికాపై ఏ హరికేన్‌ విరుచుకుపడనంత బలంగా శాండీ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అట్లాంటిక్‌ సిటీ దగ్గర ఈ తుఫాన్ తీరాన్ని తాకింది. శాండీ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 22లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ లోని సబ్ వేలలో భారీగా వరద నీరు చేరింది. ఇప్పటి వరకు 12వేల విమాన సర్వీసులు రద్దు చేశారు. సుమారు 5 కోట్ల మంది అమెరికన్లను శాండీ కష్టాల్లోని నెట్టేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్...ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అమెరికాలో భర్తతో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'ముద్ర' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఓనర్ పాత్రలో నటిస్తోందని, అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్‌లు చేయించే ఆంటీలా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X