ఆర్తీ అగర్వాల్‌కు అంగలూరా? సింగలూరా?
ఆర్తీ అగర్వాల్‌కు ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇది తరుణ్‌తో ఆమె ప్రేమాయణం విషయం కాదు. ఆమె కెరియర్ ముచ్చట. ఒకప్పుడు తెలుగులో పెద్ద హీరోల సరసన ఒక వెలుగు వెలిగిన ఆర్తి నట జీవితాన్ని ప్రేమ వ్యవహారం, క్రమశిక్షణ రాహిత్యం దెబ్బతీశాయి. ఆత్మహత్యా యత్నం చేశాక ఆమె కెరీర్ మరీ ప్రమాదంలో పడింది. చికిత్స కోసం ఆమెరికా వెళ్ళిన ఆమె డాక్టర్లు ఇచ్చిన సమయంలోపే కోలుకుని తిరిగి వచ్చింది. తలకు తీవ్ర గాయమైన ఆమె గుండు చేయించుకోవలసి వచ్చింది. తన కారణంగా ఆగిపోయిన అందాల రాముడు సినిమాలో నటించడానికి ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చింది. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆ సినిమా హిట్‌కాక పోయినా కనీసం యావరేజి అయినా తన తెలుగులో తన కెరియర్ మళ్ళీ చిగురిస్తుందని ఆర్తి ఆశిస్తోంది. ఒక వేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే అమెరికా వెళ్ళిపోవాలనుకుంటోంది.


Click it and Unblock the Notifications