చివరకు ఆర్తి అగర్వాల్ కూడా 'రాశి' దారిలోనే ప్రయాణిస్తోంది
నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో పరిచయమైన ఆర్తి అగర్వాల్ ని ఇప్పుడు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆమె అప్పట్లో శుభాకాంక్షలు చిత్రంతో ఒక ఊపు ఊపిన రాశి మాదిరిగా లావుగా మారిపోయి జనాల్ని భయపెడుతోంది. ఆమె ఎంత రేటు తగ్గించినా ఆమెను బుక్ చేసే వారు కరువయ్యారు. రోజుకు లక్ష అన్నా ఆమె వంక చూసే వారు కనపడటం లేదు.ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం 'వనకన్య వండర్‌వీరుడు' అనే చిత్రం మాత్రమే ఉంది. జాలాది శివశంకర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వనకన్యగా ఆర్తి ఈ చిత్రంలో కనపించనుంది. వండర్ వీరుడిగా మెగా సుప్రిమ్ అనే నటుడు ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











