రెండో పెళ్లికి..ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ తన వివాహం ఫెయిల్యూర్ గురించి మీడియా వద్ద మనస్సు విప్పింది. ఆమె మాటల్లోనే..మామూలుగానే పెళ్ళి ప్రపోజల్ వచ్చింది. ఇద్దరి జాతకాలు కలిసాయన్నారు. ఆ తర్వాత మూడు,నాలుగు నెలలపాటు ఫోన్ లో ఇంటర్నెట్ లో ఛాటింగ్ చేసుకున్నాం. పెళ్ళికి ముందు మేం ఒక్కసారి కూడా కలవలేదు. అయినా ఫోన్ లో మట్లాడుకున్నాం ..వాటిని బట్టి ఒకరికి బాగా నచ్చుతామనిపించి, పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఆ టైమ్ లో నేను గోరింటాకు, దీపావళి సినిమాల షూటింగ్ లో ఇక్కడ బిజీగా ఉండటంతో అమెరికా వెళ్ళే ఛాన్స్ లేకపోయింది. అందుకే తనిక్కడకి రావటమే కరెక్టు అనుకున్నా. అయితే తనకి జాబ్ లో ఎక్కువ సెలవలు లేకపోవడంతో ఠక్కుమని ఇండియా వచ్చి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని వెల్ళిపోయారు. తర్వాత నేనే అమెరికా వెళ్లాను. కలిసి కొన్నాళ్ళు ఉన్నాక ఇద్దరికీ అర్దం అయింది. ఒకరికొకరం సరిజోడి కాదని..మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అస్సలు లేదని. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం...అయినా నా జాతకంలో రెండు సార్లు పెళ్ళి చేసుకోవాలని రాసుంది...అందుకే అలా అయ్యింది అంది.మరి పెళ్ళెప్పుడు అంటే ..ఇప్పుడప్పుడే లేదు..ప్రస్తుతం కెరీర్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నా అంది.


Click it and Unblock the Notifications











