మరో హీరోయిన్ ఆర్తియా చాబ్రియా వరస మార్చి ఐటమ్ సాంగ్ తో అలరించబోతోంది. 'ధూమ్ ధూమ్ రే ...ధూమ్ ధుమారే' అంటూ సాగే సాంగ్ లో రష్యన్ డాన్సర్స్ తో కలిసి వెంకటేష్ ని ఆమె కవ్వించబోతోంది. యోగి దర్శకత్వంలో రెడీ అవుతున్న 'చింతకాయల రవి' చిత్రం కోసం ఈ పాట రెడీ అవుతోంది. ఇక ఈ పాటని చంద్రబోస్ రాయగా అహ్మద్ ఖాన్ కొరియోగ్రఫి అందిస్తున్నారు. షారూఖ్ ఖాన్ సూపర్ హిట్ 'ఓం శాంతి ఓం' సినిమా ఫేం విశాల్ శేఖర్ సంగీత దర్శకత్వంలో ఈ పాటని స్వరపరిచారు. వెంకటేష్, అనూష్క, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలుగా నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే ఈ పాట కథకు హెల్ప్ అవటమే కాక ప్రేక్షకులని పూర్తి స్థాయిలో అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెపుతున్నారు.
Story first published: Monday, July 13, 2026, 17:16 [IST]