ఆర్తి అగర్వాల్ రికార్డింగ్ డాన్స్ ట్రూపు నడుపుతుందా?
ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్రహీరోలతో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్...ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అమెరికాలో భర్తతో ఇమడలేక మళ్లీ సినిమాల్లో నటించడానికి తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
దీంతో దిక్కులేక ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేస్తూ నెట్టుకొస్తుంది. హీరోయిన్‌గా అవకాశాలు లేక పోవడంతో ఫిజిక్‌ను కూడా మెయింటెన్ చేయడం మానేసింది. దీంతో హీరోయిన్ షేపులు పోయి ఆంటీలా తయారైంది ఆర్తి. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'ముద్ర' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఓనర్ పాత్రలో నటిస్తోందని, అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్‌లు చేయించే ఆంటీలా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. డాన్స్ మాస్టర్ నుంచి డైరెక్టర్‌గా ప్లాప్ టాక్ తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్ ఆర్తి రేంజి పెంచుతాడో? మరింత తగ్గిస్తాడో చూడాలి. అన్నట్లు వీరిద్దరి మధ్య కొంత కాలంగా 'సం'బంధం కొనసాగుతుందనే గసగుసలు కూడా ఉన్నాయి. అయినా ఆ సంగతి మనకెందుకు లెండి!


Click it and Unblock the Notifications











