For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్తికి అంత సీనా??

    By Staff
    |

    'నువ్వునాకునచ్చావ్' చిత్రం ద్వారా పరిచయమైన ఎన్నారై భామ ఆర్తి అగర్వాల్. అటుపై గ్లామర్ తారగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అటుపై ఆర్తి కెరీర్ వివాదాలమయం అయి, ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఈ దెబ్బతో ఆర్తి కెరీర్ సంధిగ్ధంలో పడింది. ఇహ లాభం లేదనుకున్న ఆర్తి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఇటీవలే తిరిగొచ్చి తన సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆర్తి, తన కెరీర్ ను తీసుకెళ్లి 'మెంటల్ కృష్ణ' పోసాని చేతిలో పెట్టింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొంటూ, కుదిరిన ప్రతీసారి హద్దులు దాటేస్తూ.... చివరికి అధరచుంబనాలకి కూడా ఓకే అనేస్తోంది.

    ఇదిలా వుంటే ఈ మధ్యన మీడియాతో ముచ్చటించిన ఆర్తి తన అభిమాన నటి సావిత్రి అనీ, ఎప్పటికైనా సావిత్రి గారిలా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అనీ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇప్పుడు తాను చేస్తున్న చిత్రాలన్నీ మహిళా ప్రాధాన్యం గల చిత్రాలేనని, దీంతో తన కెరీర్ ఊపందుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయినా సావిత్రి మహానటి. ఆమె లాంటి నటీమణి ఇప్పటి వరకూ రాలేదు, భవిష్యత్తులో రారు కూడా. అలాంటి మహా నటిని ఆదర్శంగా తీసుకోవడం మంచిదే కానీ, ఆమెలాగా పేరు తెచ్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. అయినా పోసానితో సినిమాలు చేసిన నటీమణుల కెరీర్ ఏ విధంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సత్యకృష్ణన్ లాంటి తారలను చూస్తే తెలుస్తుంది. ఈ వార్తను విన్న సినీజనాలు మాత్రం ఆర్తికి అంత సీనుందా, పగటి కలలు కంటోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X