ఆర్తి అగర్వాల్‌ అందాలరాముడు 11న

By Staff

సునీల్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఎన్‌.వి. ప్రసాద్‌, పారస్‌ జైన్‌ నిర్మిస్తున్న అందాల రాముడు సినిమా రీ-రికార్డింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర సమర్పకులు ఆర్‌.బి. చౌదరి తెలియచేస్తూ, "పాటలతో సహా సినిమా మొత్తం పూర్తయింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటల ఆడియో క్యాసెట్‌ను ఈ నెల ఇరవై ఒకటో తేదీ మార్కెట్‌లో విడుదల చేయబోతున్నాం. మా బ్యానర్‌లో అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎస్‌. ఎ. రాజ్‌కుమార్‌ ఈ సినిమాకూ వినసొంపైన బాణీలను అందిం చారు. ఈ సినిమా కూడా తప్పకుండా మ్యూజికల్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11వ తేదీ విడుదల చేయబోతున్నామని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వాకాడ అప్పారావు తెలిపారు. ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న పి. లక్ష్మీ నారాయణ (దీప్తి) చాలా బాగా కథను తెరకెక్కించారని, ఇటీవల కేరళలో చిత్రీకరించిన పాటలు కూడా కన్నుల విందుగా ఉంటాయని చెప్పారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X