ఎన్నారైని పెళ్లి చేసుకున్న ఆర్తీ అగర్వాల్ పెళ్లికి ముందు నటించిన సినిమా దీపావళి. దీపావళి సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. వేణు తొట్టెంపూడి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మేఘా నాయర్ హీరోయిన్ గా చేస్తోంది. అంటే ఆర్తీ అగర్వాల్ పెళ్లైన తరువాత విడుదల అవనున్న తొలి సినిమా ఇది. హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో వేణు ఢిల్లీలో పరిచయమైన అమ్మాయి ప్రేమలో పడడమే కథాంశం.