ఆమెరికాలో ఆర్తీకి సత్కారం 14న
అందాల తార ఆర్తీ అగర్వాల్ అమెరికాలో తెలుగువారిని అలరించబోతోంది. అదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో. ఆగస్టు 14 సాయంత్రం 7.30 గంటల నుంచి మిల్‌పిటాస్‌లోని స్వాగత్ రెస్టారెంట్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఆర్తీ, ఆమె సోదరి అదితి అగర్వాల్ పాల్గొంటున్నారు. ఒక దుర్ఘటనలో తలనరాలు చిట్లి కొద్ది రోజులు మృత్యువుతో పోరాడి బతికి బయటపడిన ఆర్తీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె త్వరగా కోలుకోవాలని స్వయంగా శుభకామనలు చెప్పదలుచుకుంటే తెలుగువారికి ఇది ఓ సదవకాశం.
స్వాగత్ రెస్టారెంట్, బే ఏరియా తెలుగు సంఘం (బాటా), గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థలు అగర్వాల్ సోదరీమణులిద్దరినీ సత్కరించబోతున్నాయి. ఆర్తీ చివరిగా నటించిన తెలుగు సినిమా అందాల రాముడుని గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ అమెరికాలో ఆగస్టు 18న విడుదల చేస్తోంది. ఆ సినిమాని తన ఫ్యాన్స్‌తో కలిసి వీక్షించడానికి ఆర్తీ అంగీకరించింది కూడా. ఈ కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు కావాలంటే.. సాగర్ (469-544-5037)ని సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications











