'ఆర్య-2' లీకుల లీలలు
ఈ మధ్యన సినిమా విడుదలకు ముందే అందులోని సన్నివేశాలు, పాటలు, షూటింగ్ దృశ్యాలు నెట్ లో దర్శనమివ్వడం సర్వసాధారణమయిపోయింది. షూటింగ్ సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా ఈ లీకులకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు. ఆ మధ్యన బాలకృష్ణ హీరోగా వచ్చిన 'మిత్రుడు' సినిమాలోని ఓ పాట విడుదలకు ముందే యూ-ట్యూబ్ లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. శంకర్, రజనీ, ఐశ్వర్యల కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీ సినిమా 'రోబో' షూటింగ్ దృశ్యాలు కూడా నెట్ లో దర్శనమిస్తున్నాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన శంకర్ షూటింగా స్పాట్ లో సెల్ ఫోన్ లను అనుమతించుటలేదట. విక్రమ్, శ్రియల కాంబినేషన్ లో వచ్చిన 'మల్లన్న' చిత్రం పాటలు కూడా సినిమా విడుదలకు దాదాపు సంవత్సరం ముందు నుండీ నెట్ లో ఊదరగొట్టాయి.
తాజా అల్లు అర్జున్ కథానాయకుడుగా 'ఆర్య' ఫేం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'ఆర్య-2' చిత్రం పాటలు కూడా ఆడియో విడుదలకు నెల రోజుల ముందే నెట్ లో దర్శనమిచ్చాయి. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ కూడా లీకయ్యాయి. ఈ లీకుల గోల అటుంచితే ఈ పోస్టర్స్ లో అల్లు అర్జున్ చాలా బాగున్నాడట. అల్లు అర్జున్ తో పాటు కాజల్, శ్రద్ధా దాస్, బ్రహ్మానందం, నవదీప్ లు వున్న ఈ పోస్టర్ అలా లీకైన ఓ పోస్టరే.


Click it and Unblock the Notifications











