»   » డాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య

డాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినిమా, రంగస్థల, టీవీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య సంఘటన జరిగిన మరుసటి రోజే టీవీ రంగానికి చెందిన మరో కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్లో టీవీలో పాపుల్ డాన్స్ షో 'ఆట'లో డాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించాడు.

భరత్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటీ కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆట ఫ్రోగ్రాంలో శ్రీవిద్యతో కలసి అతను చేసిన డాన్స్ అప్పట్లో ఆట ఫ్రోగ్రామ్ కే హైలెట్ అయ్యేలా ఉండేదని తోటి కళాకారులు అంటున్నారు.

టీవీ షోలు తగ్గడంతో పాటు వివాహం కూడా కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని, డబుల్ బెడ్ రూం నుండి చిన్న ఇంటికి మారాడని సన్నిహితులు అంటున్నారు. గత కొంత కాలంగా చిన్నారులకు డ్యాన్స్ నేర్పుతున్నాడు.

అయితే కెరీర్ తాను ఆశించిన స్థాయిలో లేక పోవడం, ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయిన భరత్ ఆదివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.

English summary
"Aata" Dance Master Bharath Commits Suicide.
Please Wait while comments are loading...