Just In
- 10 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 19 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విక్టరీ వెంకటేష్‌కోసం మరో పవర్‌ఫుల్ టైటిల్ : వెంకీ సినిమా పై పెరిగిన అంచనాలు

చాలా కాలం గ్యాప్ తీసుకున్నాక బాబు బంగారం లాంటి గట్టి ఫ్లాప్ తో వచ్చి "గురు" తర్వాత కాస్త ఆ డామేజ్ ని కవర్ చేసుకున్నాడు వెంకీ, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ వచ్చింది. రానా తో నేనే రాజు నేనే మంత్రి చేసి కొత్తగా ఫామ్ లోకి వచ్చిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ మూవీకి సర్వం సిద్ధం చేశారు. ఈ సినిమాకు టైటిల్ గా ఆటా నాదే.. వేటా నాదే అని పెడుతున్నారని తెలుస్తుంది.

పవర్ ఫుల్ సినిమాతో
టైటిల్ తో అదృష్టం లాంటి సెంటిమెంట్ ఏమైనా ఫాలో అయ్యాడేమో.. గానీ రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన తేజ మరోసారి వెంకటేష్ తో అలాంటి ఓ పవర్ ఫుల్ సినిమాతోనే వస్తున్నాడట. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమైన తేజ కొన్ని నెలల క్రితం నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

అదే తరహాలో
ఈ దర్శకుడు ఇంతకుముందు చిత్రం అనే టైటిల్ సక్సెస్ అవ్వగానే.. జయం.. నిజం.. ధైర్యం.. లాంటి టైటిల్స్ తో ఎక్కువగా కనిపించాడు. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో వెంకటేష్ తో తీయబోయే సినిమాకి కూడా NRNM కి తగ్గట్టు పెట్టనున్నాడు.

నేనే రాజు, నేనే మంత్రి
"నేనే రాజు, నేనే మంత్రి" అని నాలుగు పదాల టైటిల్ తో హిట్ కొట్టిన సెంటిమెంట్ తోనే, తేజ ఈ సినిమాకు కూడా నాలుగు పదాల టైటిల్ ను పెట్టాడట. ఇక డిసెంబర్ 13 వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

కాజల్ ను హీరోయిన్ గా
ప్రస్తుతానికి ఇదే టైటిల్ అనుకుంటున్నామని, ఇంకా మంచి టైటిల్ దొరికితే మారుస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏమో కొద్ది రోజుల క్రితం ఇదే సినిమాకి "ఈ నగరానికి ఏమైందీ" అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వెంకీ సరసన కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి డిస్కషన్లు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే..

ముందుగా.. వెంకీ సినిమా
ముందుగా.. వెంకీ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ కంటే ముందు తో సినిమా కమిట్ అయ్యాడు. సుందరకాండ తర్వాత మళ్లీ ఇప్పుడు లెక్చరర్ పాత్రలో వెంకటేశ్ కనిపించబోతున్నాడు.

మల్టీ స్టారర్‌గా
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం మల్టీ స్టారర్‌గా రూపొందబోతోందని, నారా రోహిత్ లేదా సుమంత్ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప ఏ విషయం అనేది చెప్పడం కష్టం.