చిరంజీవి గారి కోసమే శ్రీజకు ఫోన్ చేసాను.. ఆ విషయంలో మోసం చేశారు!

తెరపై సినీ తారలు ఎలా కనిపించినా తెర వెనుక మాత్రం మరోలా ఉంటారనేది ఇప్పుడిపుడే జనాలకు తెలుస్తోంది. ఎలాంటి సంఘటనలు జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ తారలు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా భయటపెడుతున్నారు. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ సందీప్ కూడా తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టాడు.

 ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్..

ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి గారంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన సందీప్ ఆయనకి సంబంధించిన ఒక ఈవెంట్ లో తనకు ఒక అవమానం జరిగిందని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కావాలనే తనను మోసం చేశారని చెబుతూ.. ఆ మోసం వెనక కొందరి హస్తం ఉన్నట్లు కూడా ఆట సందీప్ వివరణ ఇవ్వడం మీడియాలో వైరల్ గా మారింది.

హీరోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్..

హీరోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్..

ఆట షో ద్వారా అప్పట్లో సందీప్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా తన డ్యాన్స్ టాలెంట్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చేవాడు. పైగా ఎన్నోసార్లు స్టార్ హీరోల నుంచి ఈ కొరియోగ్రాఫర్ కి మంచి ప్రశంసలు అందాయి. ఇక మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో తనకు జరిగిన అవమానం ఇటీవల సందీప్ బయటపెట్టాడు.

మెగాస్టార్ కోసం..

మెగాస్టార్ కోసం..

గతంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే అందుకోసం ఆట సందీప్ తన డ్యాన్స్ టాలెంట్ తో అందరిని ఎట్రాక్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికే ప్రోగ్రామ్ షెడ్యూల్ సెట్టవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని వెళ్లి కలిసినట్లు చెబుతూ.. ఆయనను రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకోలేదట. దీంతో నేను కళ్యాణ్ దేవ్ ని కలిశానని అతను నాకు మంచి స్నేహితుడు అని సందీప్ వివరించాడు.

శ్రీజతో కూడా మాట్లాడాను..

శ్రీజతో కూడా మాట్లాడాను..

కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజతో కూడా మాట్లాడి తన డ్యాన్స్ ప్లానింగ్ గురించి వివరించాను. ఆమెకు నచ్చడంతో ఒకే అన్నారు. అంతా సెట్టయ్యింది అనుకున్నా. కానీ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ పైన రెడీగా ఉన్న సమయంలో నిర్వాహకులు నన్ను పిలవలేదు. అప్పుడు సత్య మాస్టర్ డ్యాన్స్ చేశారు. అది నిజంగా నన్ను చాలా బాదించిందని తెలిపాడు.

Recommended Video

30 Years Of Classic Jagadekaveerudu Athiloka Sundari, Here’s The 1 St Story Behind Film
 కావాలనే మోసం చేశారు..

కావాలనే మోసం చేశారు..

'ఆ తరువాత నేను తెలుసుకున్న అసలు విషయం ఏమిటంటే.. సత్య మాస్టర్ కారణంగానే ఆ అవకాశం నాకు మిస్ అయినట్లు తెలిసింది. సందీప్ డ్యాన్స్ చేస్తే సత్య మాస్టర్ డ్యాన్స్ చేయనని చెప్పారట. ఒకనోక సమయంలో సత్య మాస్టర్ నేను డ్యాన్స్ చేయగా అది చూసిన రామ్ చరణ్ నన్ను ఎక్కువగా మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ నేను డ్యాన్స్ చేస్తే ఎక్కడ డామినేట్ చేస్తానేమో అని సత్య మాస్టర్ కావాలనే నన్ను ఆ రోజు స్టేజ్ పైకి రానివ్వకుండా చేశారు' అని సందీప్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X