Aata Srividya: షాకింగ్ లుక్ లో ఆట శ్రీవిద్య.. అసలు ఏమైంది? అలీని కన్నీళ్లు పెట్టించిన గాథ!

గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం. మంచి పాపులారిటీతో వెలుగు వెలిగిన నటీనటులు ఒక్కసారిగా దీనావస్థలోకి వెళ్లిపోతారు. అలాగే మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఒక్కసారిగా గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. ఇక అలాంటి మార్పుకు కారణాలైనటువంటి పరిస్థితులు, సంఘటనలు చెబితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం. తాజాగా తన కన్నీటీ గాథను చెప్పుకొచ్చింది ఆట శ్రీవిద్య. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

చిరంజీవి సినిమాలో చిన్నపాత్ర..

చిరంజీవి సినిమాలో చిన్నపాత్ర..

ప్రముఖ యాంకర్ ఓంకార్ స్టార్ట్ చేసిన ఆట డ్యాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అప్పట్లో చాలా పాపులర్ అయింది శ్రీ విద్య. చూడటానికి బొద్దుగా ఉన్న చక్కనైనా అభినయం, డ్యాన్స్ స్టెప్పులతో ఆట డ్యాన్స్ షోతో విపరీతమైన పాపులారిటీ సంపాందించుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. అనంతరం రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంత వంశీని పెళ్లాడి సినిమాలకు, షోలకు దూరంగా ఉంది.

రైటర్ వంశీ ఆయన భార్య హాజరు..

రైటర్ వంశీ ఆయన భార్య హాజరు..

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తోన్న టాక్ షో అలీతో సరదాగా. ఈ షోకి సెలబ్రిటీలను అతిథులుగా ఆహ్వానించి తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేస్తూ ఆసక్తికర సమాధానాలు రప్పిస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ఈ కార్యక్రమానికి సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ, ఆయన భార్య ఆట శ్రీవిద్య హాజరయ్యారు. ఈ సందర్భంగానే తమ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఎవరైనా మీ మనసును బాధపెట్టారా?

ఎవరైనా మీ మనసును బాధపెట్టారా?

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీవిద్య ఎందుకని గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటుంది? ఎవరైనా మీ మనసును బాధపెట్టారా? అని అలీ ఆమెను అడిగాడు. ఆ ప్రశ్నకు శ్రీవిద్యసమాధానం చెబుతూ "బాధ అనేదానికన్నా పెద్ద పదం ఉంటే.. అదే అవ్వాలి" అని ఎమోషనల్ అయింది. "మాకు ఒక బాబు, పాప ఉన్నారు. పాప కంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ప్రతీ ఏడాది ఆరోజును తలచుకొని బాధపడతుంటాను" అని చెప్పింది శ్రీవిద్య.

రెండు నెలలు పట్టింది..

రెండు నెలలు పట్టింది..

శ్రీవిద్య మాట్లాడాతూ.. "గతేడాది నాకు ప్రెగ్నెన్సీ వచ్చినా కొన్ని నెలలకే మొదటి బాబులానే ఆ బిడ్డ కూడా చనిపోయంది. నా కళ్ల ముందే ఆ బిడ్డ పుట్టడం.. అలా పక్కకి పెట్టిన నాలుగు నిమిషాల్లోనే చనిపోవడం జరిగింది. ఇలా ప్రతీ ప్రెగ్నెన్సీ నాకు చాలా రిస్కీ అయింది. ఈ చనిపోయిన బాబు పుట్టడానికే సర్జరీ చేశారు. కానీ అలా జరిగిపోయింది. ఆ బాధ నుంచి నాకు బయట పడేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టింది" అని చెప్పారు.

అందుకు సంతోషంగా ఉంది..

అందుకు సంతోషంగా ఉంది..

శ్రీవిద్య తనకు జరిగిన విషయాలను చెబుతుంటే కమెడియన్ అలీ కన్నీటి పర్యంత అయ్యాడు. అయితే తన బాబు చనిపోయాడన్న దానికి బాధ పడేందుకు తనకు సమయం ఉందని, ఆమె భర్తకు ఆమాత్రం సమయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీవిద్య. అయితే ఆటతో తాను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాని, వాళ్లు ఇప్పటికీ టచ్ లో ఉంటున్నారని శ్రీవిద్య సంతోషం వ్యక్తం చేసింది.

ముందు రచయితలే..

ఇదిలా ఉంటే శ్రీవిద్య భర్త వక్కంతం వంశీ అనేక సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన విషయం తెలిసిందే. రైటర్ తర్వాత ఆయన నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమా తర్వా ఆయనకు డైరెక్టర్ గా అవకాశం వచ్చేందుకు ఎంతో సమయం పట్టింది. ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ కూడా ముందు రచయితలనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X