ఆటగదరా శివ ట్రైలర్: వెరీ ఇంటరెస్టింగ్.. చంపేవాడు, చచ్చేవాడు కలిసే, హైపర్ ఆది పంచులే పంచులు!
ఆ నలుగురు, మధుమాసం వంటి హృదయాన్ని హత్తుకునే చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. ఈ దర్శకుడి నుంచి వస్తున్న మరో చిత్రం ఆటగదరా శివ. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలయింది. బలమైన పాత్రలతో ఈ చిత్ర కథ ఆసక్తికరంగా సాగబోతున్నట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ ఆధ్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది.
ట్రైలర్ ద్వారా కథలోని పాయింట్ ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఉరి శిక్షకు రెడీ అవుతున్న ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని ఉరితీయడానికి తలారి జీపులో బయలుదేరుతాడు. పారిపోయిన ఖైదీ అనుకోకుండా తలారికే ఎదురుపడడం, అతడినే లిఫ్ట్ అడిగి జీపులో ప్రయాణించడం ఆసక్తిని కలిగిస్తోంది. ట్రైలర్ చివర్లో.. చచ్చేవాడు చంపేవాడు కలిసే తిరుగుతున్నారు సర్ అనే డైలాగు బావుంది.

ఇక ట్రైలర్ లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెడీ పంచ్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ''దెబ్బ తగిలితే బ్లడ్ రాక బటర్ మిల్క్ వస్తుందా, ఎవరికైనా ముఖానికి గడ్డం ఉంటుంది.. వీడికి గడ్డానికే ముఖం ఉంది'' వంటి కామెడీ పంచ్ లు నవ్వులు పూయిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











