Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రపంచవ్యాప్తంగా జూలై 5న నారా రోహిత్, జగపతిబాబు 'ఆటగాళ్ళు'
ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటిస్తోన్న సినిమా 'ఆటగాళ్ళు'. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఆటగాళ్ళు సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాతో దర్శనా బానిక్ హీరొయిన్ గా పరిచయం కాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంటరెస్టింగ్ డ్రామా గా తెరకేక్కబోతున్న ఈ సినిమాకు 'గేమ్ అఫ్ లైఫ్' అనే ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. నారా రోహిత్, జగపతి బాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం కాబోతున్నాయి. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
నటీనటులు: నారా రోహిత్, జగపతి బాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్... తదితరులు. సాంకేతిక వర్గం: డైరెక్టర్: పరుచూరి మురళి, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కేనా రాము, వడ్లపూడి జితేంద్ర. బ్యానర్: ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్ . సంగీతం: సాయి కార్తీక్, కెమెరా మెన్: విజయ్ సి కుమార్.