»   » ప్రభాస్ పెళ్లికి రవితేజ అడ్డు!

ప్రభాస్ పెళ్లికి రవితేజ అడ్డు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెడ్ కార్పెట్ రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తూ శ్రీమంతి శైలజ సమర్పిస్తున్న చిత్రం ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ పెళ్లి శుభలేఖ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి చిత్రాన్ని శరవేగంగా ముగించి వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... ఆవు ఎవరు పులి ఎవరు మధ్యలో ప్రభాస్ పెళ్లికి రవితేజ అడ్డురావడం ఏంటనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకటో తరగతిలో ఉన్నప్పుడు అందరం ఆవు పులి కథ చదివుంటాం. అది అందరూ పెళ్లి చేసుకునే ముందు మళ్లీ ఒకసారి చదివితే పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు రావని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

AAVU PULI MADHYALO PRABAS PELLI press note

అలాగే పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ అంతా ఈ సినిమా చుసి తమలో తాము కొట్టుకోవడం, విమర్శించుకోవడం మానేసి అంతా ఒకటైపోవడం ఖాయం. అని అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... కీలకమైన పాత్రలో కాలకేయ ప్రభాకర్ మన ముందుతరం మహానటులు ఎస్వీ రంగారావును గుర్తు చేసే విధంగా నటించారు.

ఖచ్చితంగా కాలకేయ ప్రభాకర్ కు ఈ సినిమా విలక్షణ నటుడన్న పేరు తీసుకురావడం ఖాయం. సినిమాలో కామెడీ కోసం జోకులు వాడకుండా గ్జిజరిన్ వాడడం కొత్తగా ఉంటుంది. ప్రధాన పాత్రల్లో రవితేజ, అశ్వినీ చంద్రశేఖర్, జబర్దస్త్ ఫేం వేణు, అప్పారావుతో పాటు చాలామంది కొత్త నటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అని అన్నారు.

AAVU PULI MADHYALO PRABAS PELLI press note

సంగీతం - కవి శంకర్, కెమెరా - ఆర్లి గణేష్, సహ నిర్మాతలు - నగరం సునీల్, మధుమణి నాయుడు, నిర్మాత - రవి పచ్చిపాల, రచన, దర్శకత్వం - ఎస్.జె.చైతన్య.

English summary
Ravi Teja, Aswini Chandra Shekar, Jabardast Venu, Appa Rao, Kalakeya Prabhakar and others starrer 'AAVU PULI MADHYALO PRABAS PELLI' movie produced by Red Carpet Reels. Music : Kavi Shanker, Camera ; Arli Ganesh, Co-Producers : Nagaram Suneel and Madhumani Naidu, Producer ; Ravi Pacchipala, Director : SJ Chaitanya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu