పొట్టి హీరో సినిమాకు పొలిటికల్ కష్టాలు!

సచిన్ నటించిన ఆజాన్ సినిమా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ముస్లింల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ సమాజ్ వాదీ పార్టికి చెందిన ఫరూక్ అనే నేత నిర్మల్ నగర్ పోలీష్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సినిమా వల్ల మతపరమైన అలజడి చెలరేగే అవకాశం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తూంది. ఈ మేరకు ఐపిసి సెక్షన్ 295ఎ కింద దర్శకుడు ప్రశాంత్ చద్దా, హీరో సచిన్, నిర్మాతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆజాన్ అంటే అర్థం ప్రార్థనలు చేయడానికి పిలిచే ఇస్లామిక్ ఇన్విటేసషన్. ఇంత పవిత్రమైన పేరుగల ఈ సినిమా మొత్తం ముస్లిం టెర్రరిజం నేపథ్యంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో హర్టయిన్ ముస్లిం నేత ఫరూఖ్ ఈ ఫిర్యాదు చేసినట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











