twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బాస్ అలీకి అవార్డా? బాహుబలికి ఆయన పనిచేయలేదు: నిర్మాత

    By Bojja Kumar
    |

    65వ జాతీయ సినీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు(ఏప్రిల్ 13) ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి-2 చిత్రానికి మూడు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ష్, ఉత్తమ వినోదాత్మక చిత్రం విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. అయితే ఉత్తమ యాక్షన్‌కు‌ గానూ అబ్బాస్‌ అలీ మొఘల్‌కు జాతీయ అవార్డును ప్రకటించినట్లు ఎంఐబీ ఇండియా ట్వీట్‌ చేయడంతో నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    అబ్బాస్ అలీ మొగుల్‌ బాహుబలికి పని చేయలేదు

    బాహుబలి కానీ, బాహుబలి 2 చిత్రానికి కానీ అబ్బాస్ అలీ మొగుల్ పని చేయలేదు. ఆయనకు అవార్డు రావడం ఏమిటి? అంటూ నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

    మా కష్టానికి తగిన గుర్తింపు లభించింది

    బాహుబలి2 టీం పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది. బాహుబలి చిత్ర టీమ్‌కు అభినందనలు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీ కమిటీకి కృజ్ఞతలు.... అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. 2017లో విడుదలైన బాహుబలి 2 సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

    ఘాజీ చిత్ర టీమ్‌కు అభినందనలు

    ‘ఘాజీ' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ చిత్ర టీంను అభినందించారు శోభు యార్లగడ్డ. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ తెలిపారు.

    విలేజ్ రాక్‌స్టార్

    ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకున్న అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్' బృందాన్ని అభినందిస్తూ శోభు యార్లగడ్డ మరో ట్వీట్ చేశారు.

    English summary
    It was announced that Abbas Ali Moghul won the National Award for Best Special Effects. However, Producer Shobu took to Twitter to reveal that he didn't work for Baahubali at all. He wrote, "Abbas Ali Moghul ?? He didn't work for BaahubaliMovie 1 or 2.. :)(sic)"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X