ఫేడవుట్ అయిన హీరోయిన్లు ఐటం భామలుగా అవతారమెత్తుతుంటే...ఫేడవుట్ అయిన హీరోలు దర్శకులుగా మారుతున్నారు. ఆ వరసలో మొన్న ఆకాష్,ఇప్పుడు అబ్బాస్ చేరుతున్నారు.అబ్బాస్ ప్రేమదేశం చిత్రంతో పాపులర్ అయి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేక కుదేలయిపోయాడు. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో చాలా చిత్రాలు చేసాడు. మొన్నటికి మొన్న టబుతో కలసి చంద్ర సిద్దార్ధ చిత్రం ఇదీ సంగతీ లో చేసాడు.కానీ వయసయిపోయిన ఆ జంట అప్పటి మ్యాజిక్ రిపీట్ చెయ్యలేకపోయారు.దాంతో అతనికి ఇప్పుడు దర్శకత్వం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. ద్విభాషల్లో తీయబోయే ఈ చిత్రంలో స్వీయ దర్శకత్వంలో కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. నానాపటేకర్,మహేష్ మంజ్రేకర్ విలన్స్ గా చేస్తున్నారు. ప్రియాంకా చోప్రాని హీరోయిన్ గా అడుగుతున్నారని తెలుస్తోంది.