»   » రేప్ కేసులో ‘ఎబిసిడి-2’ చిత్ర నటుడు అరెస్టు (ఫోటోస్)

రేప్ కేసులో ‘ఎబిసిడి-2’ చిత్ర నటుడు అరెస్టు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన 3డి మూవీ ‘ఎబిసిడి-2' చిత్రంలో డాన్సర్‌గా నటించిన వ్యక్తి 14 ఏళ్ల మైనర్ బాలికను రేప్ కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో సదరు డాన్సర్ తో పాటు మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు.

‘ఎబిసిడి-2' చిత్రంలో బ్యాక్ అప్ గా నటించిన నీలేష్ నిర్భవనె....మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు నెలరోజులుగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. జూన్ 26వ తేదీని పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేసినట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఈ అఘాయిత్యం జరుగుతుండగా...బాధితురాలి టీచర్ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

తనను ముగ్గురు యువకులు లైంగికంగా వేధిస్తున్నారని టీచర్ కు చెప్పడంతో....ఆమె వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. విచారణ తర్వాత నిలేష్ ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. అతడిపై ఐపిసి సెక్షన్ 376డి(గ్యాంగ్ రేప్), 377(అసహజ నేరం), 34 కింద కేసు నమోదు చేసారు.

తనపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. ప్రస్తుతానికి నీలేష్ అరెస్టవ్వగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. స్లైడ్ షోలో ప్రధాన నిందితుడు నీలేష్ ఫోటో, బిసిడిడి 2 చిత్రానికి సంబంధించిన ఫోటోలు...

ప్రధాన నిందితుడు

ప్రధాన నిందితుడు


ఇతనే నీలేష్ నిర్భవనె. మైనర్ బాలిక రేప్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఎబిసిడి 2 చిత్రంలో బ్యాక్ అప్ డాన్సర్ గా నటించాడు.

ఎబిసిడి 2 డాన్సర్స్

ఎబిసిడి 2 డాన్సర్స్


డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్....రెమో డిసౌజా తన డాన్సింగ్ టీమ్ తో కలిసి డాన్సింగ్ స్కిల్స్ చూపెడుతున్న దృశ్యం.

ఎబిసిడి 2 స్టార్స్

ఎబిసిడి 2 స్టార్స్


ఎబిసిడి 2 హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్...దర్శకుడు రెమో డిసౌజాతో కలిసి ఇలా...

శ్రద్ధా కపూర్ విత్ రెమో

శ్రద్ధా కపూర్ విత్ రెమో


దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాతో కలిసి హీరోయిన్ శ్రద్ధా కపూర్.

ఫన్నీ మూమెంట్

ఫన్నీ మూమెంట్


ఎబిసిడి 2 సినిమా సెట్లో ఓ ఫన్నీ మూమెంట్...

ఎబిసిడి 2 తారాగణం

ఎబిసిడి 2 తారాగణం


ఎబిసిడి 2 సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం.

డాన్స్ ప్రాక్టీస్

డాన్స్ ప్రాక్టీస్


డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఎబిసిడి 2 చిత్ర నటీనటులు.

దర్శకుడు, హీరోయిన్

దర్శకుడు, హీరోయిన్


దర్శకుడు రెమో డిసౌజాతో కలిసి హీరోయిన్ శ్రద్ధా కపూర్ సెల్పీ.

ఫన్ ట్రిప్

ఫన్ ట్రిప్


ఎబిసిడి 2 షూటింగ్ సందర్భంగా వరుణ్ ధావన్, ఇతర యూనిట్ సభ్యులు కలిసి ఫన్ ట్రిప్ వెళ్లినప్పటి దృశ్యం.

శ్రద్ధా సెల్పీ

శ్రద్ధా సెల్పీ


చిత్ర యూనిట్ సభ్యుడితో కలిసి హీరోయిన్ శ్రద్ధా కపూర్ సెల్పీ.

English summary
One dancer of the movie ABCD 2 starring Varun Dhawan and Shraddha Kapoor has been arrested for allegedly raping a mentally challenged 14-year-old girl. The accused happens to be one of the dancers in the film and two more persons are allegedly included in the crime, who are absconding.
Please Wait while comments are loading...