For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుదేవా ‘ABCD’ తెలుగులో కూడా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కొరియోగ్రాఫర్‌గా తెరంగ్రేటం చేసి సత్తా చాటిన ప్రభుదేవా...ఆపై నటుడిగాను అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడిగా తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇట్టే ఇమిడి పోతున్న ప్రభుదేవా డాన్స్ ప్రధానంగా కొనసాగే ఓ సినిమాలో నటిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ రేమో డిసౌజా దర్శకత్వంలో 'ABCD (ఎనీ బడీ కెన్ డాన్స్)' చిత్రం రూపొందుతోంది.

    ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలు కాన్నాయి. పనులన్నీ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే...ఇది ఇండియాలోనే తొలి 3డి డాన్స్ నేపథ్య మూవీ. యూటీవీ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరిలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

    ఈ సినిమాలో ప్రభుదేవా డాన్సర్ గా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా కొరియోగ్రఫీ నేపథ్యంలో సాగుతుందని, డాన్స్ ఇష్ట పడేవారికి ఈసినిమా పూర్తి సంతపృని ఇచ్చే విధంగా ఉంటుందని, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఏ సినిమాలోనూ చూడని విధంగా కళ్లు చెదిరే స్టెప్పులు ఈ చిత్రం కంపోజ్ చేస్తున్నారు. ఈచిత్రంలో గతంలో ప్రభుదేవా నటించిన ప్రేమికుడు చిత్రంలోని 'ముక్కాలా ముక్కాబులా' సాంగుకు కూడా స్టెప్పులు వేయనున్నారు.

    English summary
    ABCD(Anybody Can Dance) dubbing it into Tamil and Telugu. It is the first dance film of India in 3D and being directed by director and choreographer Remo D’Souza and produced by UTV. It stars dance masters like Prabhu Deva and Ganesh Acharya in key roles and is based on a reality dancing event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X