యంగ్ హీరో సహజీవనం చేస్తున్నానని..
బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ డయోల్ తన ఓటు సహజీవనానికేనని అన్నారు. అలాగే తాను ప్రస్తుతం తన గర్ల్ ప్రెండ్ ప్రీతీ దేశైతో సహజీవనం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. టీవీలో ఓ ఛాట్ షోకి వచ్చిన అభయ్ డయోల్ బాలీవుడ్ లో పెరిగిపోతున్న సహజీవనం సంస్కృతిని తాను సమర్దిస్తానని, తాను ఎవరికోసమూ బ్రతకటం లేదని, తాను తనకోసమే బ్రతుకుతున్నానని అన్నారు. అలాగే వివాహం అనేది కేవలం ఓ సంప్రదాయమని, ప్రకృతి ఎప్పుడూ ఎవరికి పెళ్లి చేసుకోమని చెప్పలేదని, కాబట్టి తాను సహజీవనాన్ని ఫాలో అవుతానని అన్నారు.
అలాగే తాను పెళ్ళి చేసుకుంటానో లేదో చెప్పలేను కానీ సహజీవనాన్ని మాత్రం కంటిన్యూ చేస్తానని వివరించారు. మరి కుటుంబం సపోర్టు ఉంటుందా అంటే తన కుటుంబం బాగా సంప్రదాయం కావటంతో వారికి ఇవి నచ్చవని అన్నారు. ఇక తమ అంకుల్ ధర్మేంధ్ర తనకు తండ్రి లాంటివాడు అని..తన కజిన్స్ లోసన్నిడయోల్ కీ తనకీ చాలా ఏజ్ గ్యాప్ ఉందని, తాము అతనికి పిల్లలలాంటివారమని తేల్చాడు. ప్రస్తుతం తాను షాదీ ఆఫ్ ది డెడ్ చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేస్తున్నాని, హిందీలో మొదటి డార్క్ కామిడీ అదేనని అన్నాడు.


Click it and Unblock the Notifications











