twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నాకు చేదు అనుభవం.. మిల్కీ బ్యూటిలకు చురకలంటించిన బాలీవుడ్ హీరో

    |

    అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల దమనకాండపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వర్ణ వివక్షను వీడాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. జార్జ్ ఫ్లాయడ్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయితే తారాలోకం అమెరికా నల్లజాతీయులకు అండగా నిలువడంపై ప్రశంసలు కురుస్తున్నా.. మరోవైపు దేశంలో పోలీసుల పైశాచికత్వాన్ని ప్రశ్నించకుండా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇక విమర్శలపై వివరాల్లోకి వెళితే..

    తమన్నా సెన్సేషనల్ ట్వీట్

    తమన్నా సెన్సేషనల్ ట్వీట్

    అమెరికాలో నల్లజాతీయులపై హింసపై బ్యూటీ తమన్నా భాటియా ట్విట్టర్‌లో స్పందించారు. మౌనంగా ఉంటే మీకు రక్షణ కరువు అవుతుంది. ఎలాంటి మౌనమేనా విశ్వ నియమావళికి వ్యతిరేకం. మానవులుగా దేనిపై స్పందించాలో.. స్పందించకూడదో అనే విషయాన్ని నేర్చుకోవాలి. ప్రేమను, అనురాగాలను కురిపించాలి. మనకు అన్ని వర్ణాలు, అన్ని జాతులు, అన్ని ప్రాణాలు ముఖ్యమే. ప్రపంచ జనులారా మేల్కొనండి అంటూ తమన్నా ట్వీట్ చేశారు.

    సోనమ్ కపూర్ ఆందోళన

    సోనమ్ కపూర్ ఆందోళన

    అమెరికా జాత్యహంకారంపై బాలీవుడ్ నటి సోనమ్ కూడా స్పందించారు. అన్యాయం జరుగుతున్న సమయంలో తెలిసి కూడా నీవు మధ్యస్థంగా ఉంటే నీవు కూడా హింసను ప్రోత్సహించిన వాడివే అవుతావని డెస్మండ్ టుటు వ్యాఖ్యలను ఉదహరించింది.

    సినీ తారలను ప్రశ్నిస్తున్న నెటిజన్లు

    సినీ తారలను ప్రశ్నిస్తున్న నెటిజన్లు

    ఇలా భారతీయ నటులు శ్వేత జాతి దురహంకారాన్ని ప్రశ్నించడం సరే కాని.. దేశంలో జరిగే వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు. కేవలం అమెరికాలో జరిగే అన్యాయాల గురించే ఎందుకు మాట్లాడుతారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నల్లజాతీ గురించి మాట్లాడేవారు తెల్లగా కావడానికి ఫేస్‌ క్రీమ్‌ల ప్రకటనల కోసం వెంపర్లాడుతుంటారు. ఇలాంటి ద్వంద ప్రమాణాలు సమంజసమా? అంటూ ప్రశ్నించారు.

    Recommended Video

    Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
    ద్వంద ప్రమాణాలు అంటూ అభయ్ డియోల్

    ద్వంద ప్రమాణాలు అంటూ అభయ్ డియోల్

    ఇక బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ హిందీ సినీ తారల ద్వంద ప్రమాణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనకు వలస కార్మికుల జీవితాలు కూడా ముఖ్యమే. మైనారిటీల జీవితాలు కూడా అత్యంత ప్రధానం. పేదల జీవితాలు కూడా మనకు పట్టింపు ఉండాలి అంట అభయ్ చురకలు అంటించారు.

    English summary
    Tamannaah Bhatia about Black Lives Matters: Many called out popular actors for speaking out against racism in the US but advertise whitening creams. Actor Abhay Deol criticised his colleagues in the industry, saying, "woke Indian celebrities" have been speaking out on Black Lives Matters but failing to speak up on similar instances within the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X