పెళ్ళైన వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. నన్ను 'కీప్' అన్నా పర్వాలేదు.. సింగర్ సంచలనం!

ప్రముఖ గాయని అభయ హిరణ్మయి ప్రేమికుల రోజు సందర్భంగా తన రిలేషన్ ని బయట పెట్టింది. తాను ఓ సంగీత దర్శకుడితో సంతోషంగా సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు.. తెలుగు, మలయాళంలో సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్న గోపి సుందర్. తామిద్దరం కొన్నేళ్లుగా కలసి జీవిస్తున్నట్లు అభయ హిరణ్మయి తెలిపింది. తమ ప్రేమ గురించి ప్రకటన చేస్తూ ఎవరేమనుకున్నా పర్వాలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

 గత ఎనిమిదేళ్లుగా

గత ఎనిమిదేళ్లుగా

గత ఎనిమిదేళ్లుగా మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం. చాలా సార్లు మేమిద్దరం కలసి పబ్లిక్ గా కనిపించినప్పటికీ మా ప్రేమ గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అవును.. నేను పెళ్ళైన వ్యక్తితో సహజీవనం చేస్తున్నా. అతడి పెళ్లి అధికారికంగా రద్దయింది అని అభయ హిరణ్య తెలిపింది. 2008 నుంచి తమిద్దం కలసి జీవిస్తున్నాం అని అభయ హిరణ్య తెలిపింది.

 నాకింకా పెళ్లి కాలేదు

నాకింకా పెళ్లి కాలేదు

నాకింకా పెళ్లి కాలేదు. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్ళు ఉంది. ఆయన చాలా పెద్ద శరీరం కలిగిన మనిషి. ఆయన ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తాను. ఇలా చాలా విషయాల్లో మామధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మేమిద్దరం కలసి సంతోషంగా జీవిస్తున్నాం అని అభయ హిరణ్య తెలిపింది.

కీప్ అని పిలిచినా పర్వాలేదు

తన రిలేషన్ గురించి మాట్లాడుతూ మీడియాపై అభయ సంచలన వ్యాఖ్యలు చేసింది. పచ్చ కళ్ళతో చూసే మీడియా సంస్థలు, పత్రికలు.. నన్ను కీప్ అని పిలుచుకోండి.. కుమారి, కులస్త్రీ అని ఎలాగైనా పిలుచుకోండి. కుటుంబబంధాలని పాడుచేసేది అంటూ ఎలాగైనా రాసుకోండి. నేను ఎవ్వరికి భయపడను. ఇలాంటి విషయాలని నేను పట్టించుకోను అంటూ అభయ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 షాకిచ్చిన భార్య

షాకిచ్చిన భార్య

గోపి సుందర్ కూడా తన సోషల్ మీడియా పేజీలో తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించాడు. దీనిపై గోపిసుందర్ సతీమణి ప్రియా సుందర్ ఘాటుగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు జనాల్లోకి వెళుతున్నాయని అన్నారు. గోపి సుందర్, తాను ఇంకా విడిపోలేదని, కోర్టు నుంచి అధికారికంగా ప్రకటన రాలేదని ప్రియా సుందర్ అన్నారు. దీనితో అభయ సుందర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X