»   »  దేముడా... త్రివిక్రమ్ చెప్తే, బస్ టిక్కెట్లు కొనమంటున్న మహేష్

దేముడా... త్రివిక్రమ్ చెప్తే, బస్ టిక్కెట్లు కొనమంటున్న మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు అతి త్వరలో ఆన్ లైన్ లో అభి బస్ టిక్కెట్లు కొనమని సలహా ఇవ్వబోతున్నాడు. అదేంటి మహేష్ బాబు కు ఏం పని అంటారా..మరి ఆయన ఇప్పుడు అభి బస్ ఆన్ లైన్ టిక్కెట్ పొర్టల్ కు కూడా బ్రాండింగ్ చేస్తున్నారుగా. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే ఆ యాడ్ షూటింగ్ కూడా రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తైంది. ఇప్పటికే చాలా బ్రాండ్లను తన కిట్టీలో వేసుకున్న మహేష్ ...ఈ కొత్త యాడ్ తో మనలని పలకరించటానికి రెడీ అయ్యిపోయాడు.

గతంలో మహేష్ బాబుతో 'అతడు, ఖలేజా' వంటి చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ డైరెక్ట్ చేయటంతో ఈ యాడ్ అదిరిపోయే రీతిలో వచ్చి ఉంటుందని బావిస్తున్నారు. ఈ యూడ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఈ ప్రకటన కోసం మహేష్ భారీగానే రెమ్యునేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ యాడ్ లో పాల్గొనడానికి మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమాకి సైతం బ్రేక్ ఇచ్చారు. దీంతో మురుగదాస్ టీమ్ కూడా అహమ్మదాబాద్ లో లొకేషన్లు వెతుక్కునే పనిలో పడింది. బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

Abhibus, online ticketing portal:Mahesh bags yet another endorsement deal

కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్ గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా ఎనిమి అనే టైటిల్ దాదాపుగా ఫైనల్ అన్న టాక్ వినిపించింది. తరువాత చట్టంతో పోరాటం, వాస్కోడాగామ లాంటి పేర్లు తెర మీదకు వచ్చినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్ ను నిర్ణయించారన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులో మహేశ్‌బాబు ఐబీ ఆఫీసర్ (ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్) పాత్ర చేస్తు న్నారు. అందుకే ఈ టైటిల్ అయితే యాప్ట్‌గా ఉంటుందనుకుంటున్నారట.

English summary
Mahesh doing Ad for the leading online ticketing portal, Abhibus. in the direction of his close friend Trivikram Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu