Just In
- 47 min ago
విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
- 1 hr ago
క్రాక్ పనైపోయినట్లే.. మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ డిసిషన్.. బాక్సాఫీస్ రికార్డులకు 'ఆహా' బ్రేక్
- 1 hr ago
బిగ్ బాస్ తర్వాత తొలి సినిమా: కథ విన్నానంటూ అభిజీత్ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్ ఇవ్వడంతో షాక్
- 1 hr ago
ఆ హీరోయిన్లపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు: వాళ్లలా తాను అలాంటి బ్రాలు వేసుకోనంటూ చూపించింది!
Don't Miss!
- Lifestyle
తక్కువ ధరే కదా అనీ ఇవన్నీ తెలియకుండా సెకండ్ హ్యాండ్ కొనకండి..ప్రభావం వేరేగా ఉంటుంది
- News
చైనాతో మళ్లీ చర్చలు షురూ -చుషూల్ సెక్టార్లో భేటీ అయిన రెండు దేశాల సైనిక అధికారులు -డ్రాగన్ తగ్గేనా?
- Sports
ఫిఫాను దాటేసిన ఐసీసీ.. సోషల్ మీడియాలో రికార్డు!
- Finance
తెలంగాణలో త్వరలో కొత్త ఐటీ పాలసీ: మోడీకి కేటీఆర్ వృద్ధి విజ్ఞప్తి
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త సినిమాలపై అప్‌డేట్.. అది పెద్ద విషయం కాదు.. అభిజిత్ సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ నాల్గో సీజన్ నుంచి బయటకు వచ్చాక కంటెస్టెంట్లందరూ ఫుల్ బిజీ అయ్యారు. సినిమాలు, ఇతర షోలతో సందడి చేస్తున్నారు. విన్నర్ రన్నర్ మూడో స్థానంలో నిలిచిన అభిజిత్ అఖిల్ సోహెల్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఈ ముగ్గురే కాకుండా ఇంకొంత మందికి అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి. మెహబూబ్ పలు ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దివికి వెండితెరపై గోల్డెన్ చాన్స్‌లు వస్తున్నాయి. మోనాల్ ఆల్రెడీ కొత్త షోను మొదలెట్టేసింది. సినిమాల్లో ఐటెం సాంగ్ కూడా చేసేసింది.

మొదటగా సోహెల్..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సోహెల్ కథ నిజంగా వేరేఉంది. 25 లక్షలు తీసుకుని ఆట తీరునే మార్చేశాడు. అలా తీసుకోవడం కొందరు కరెక్ట్ అని ఇంకొందరు తప్పని ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ చివరకు సోహెల్‌కు మాత్రం మంచే జరిగింది. ఇదే కాకుండా అందరి కంటే ముందు సినిమాను ప్రకటించి సత్తా చాటాడు.

అభిజిత్ కూడా..
అయితే హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సోహెల్ ఎంత ఆత్రుతగా ఉన్నాడో.. సరైన స్క్రిప్ట్ కోసం, సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని అభిజిత్ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అందుకోసమే అభిజిత్ తన పూర్తి సమయాన్ని స్క్రిప్ట్‌లు వినడానికి కేటాయించాడట. చాలా ఆఫర్లు వస్తున్నాయని అయితే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాని అభిజిత్ ఇది వరకే చెప్పేశాడు.
కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్.. అదిరిపోయే షాట్స్ ఇవే

తాజాగా అలా..
తాజాగా అభిజిత్ లైవ్‌లొకి వచ్చాడు. తన అభిమానులు పదే పదే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లపై ప్రశ్నలు అడుగుతుండటంతో క్లారిటీ ఇచ్చాడు. కథలు వింటున్నాను.. కొన్ని స్క్రిప్ట్‌లు నచ్చాయ్.. కానీ డైలాగ్స్ మళ్లీ రాయాలని అనిపించింది.. అదే చెప్పాను.. ఒక్కో రైటర్ ఒక్కోలా రాస్తుంటారు.. టైం పడుతుందని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

మూడు ఆప్షన్స్‌లు..
ట్రెండీగా వెరైటీగా ఉండే చిత్రం చేయాలా? రొమాన్స్ కామెడీ చిత్రం చేయాలా? లేదా అవుట్ అండ్ అవుట్ పక్కా తెలుగు కమర్షియల్ మూవీ చేయాలా? అని తన ఫ్యాన్స్‌ను అడిగాడు. మూడు చేసే ప్లాన్ ఉంది కానీ మొదటగా ఏది చేయాలో అర్థం కావడం లేదన్నాడు. సినిమా అనౌన్స్ చేయడం పెద్ద విషయం కాదు..కానీ సరైన సినిమాను చేయాలని అభిజిత్ చెప్పుకొచ్చాడు.