twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగ్‌పై దాడి...

    By Bojja Kumar
    |

    గబ్బర్ సింగ్ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్న....అభిమన్యు సింగ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. అతన్ని దోచుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. అయితే అదృష్ట వశాత్తు అతను వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై అభిమన్యుసింగ్ పోలీసులకు కంప్లంట్ చేశాడు.

    వివరాల్లోకి వెళితే...
    అభిమన్యుసింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై సమీపంలోని మాథెరన్ అనే పర్యటక ప్రాంతానికి కార్లో విహార యాత్రకు బయల్దేరారు. మార్గ మధ్యంలో వీరిని బైక్‌పై వెంబడించిన కొందరు దుడుగులు అతని కారును ఆపి కత్తి చూపించి బెదరించి రాబరీ చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడే అటు వైపుగా స్థానికులు కొందరు రావడంతో దుండుగులు పారి పోయారు. ఈ విషయమై అభిమన్యు సింగ్ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభిమన్యు సింగ్ అందులో విలన్ బుక్కారెడ్డి పాత్రలో అద్భుతమైన విలనీయం ప్రదర్శించాడు. ఆ తర్వాత బెజవాడ చిత్రంలోనూ తనదైన నటన కనబరిచాడు. ప్రస్తుతం అభిమన్యు సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'లో విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

    వీటితో పాటు బాలీవుడ్ లోని పలు ప్రాజెక్టుల్లోనూ అభిమన్యు సింగ్ అవకాశాలు దక్కించుకున్నాడు. 'ఉపనిషద్ గంగా' పేరుతో రూపొందుతున్న టీవీ షోలో అభిమన్యు ఏకంగా 33 పాత్రలతో అలరించడానికి సిద్దం అవుతున్నాడు. 52 వారాల పాటు ఈ షో ప్రముఖ నేషనల్ ఛానల్ లో ప్రసారం కానుంది.

    English summary
    Abhimanyu Singh was attacked while on holiday in Matheran. Apparently, Abhimanyu who was with family was assaulted by a group of goons on bikes who robbed them. Abhimanyu was driving down to Matheran when between Panvel and Matheran, a few men on bikes started following them. Despite not stopping, one of the bikers overtook him forcing him to stop. When assaulted, Abhimanu fought of the initial attacks only to be confronted by a man wielding a knife.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X