పూరీ 'నేనూ నా రాక్షసి' లో విలన్ గా చేస్తున్నది ఎవరంటే...
దగ్గుపాటి రాణా, ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న చిత్రం 'నేను.. నా రాక్షసి'. ఈ చిత్రంలో విలన్ గా అభిమన్యు సింగ్ నటిస్తున్నారు. రక్త చరిత్ర చిత్రంలో బుక్కారెడ్డి పాత్రను పోషించిన ఈ నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ ప్యావరేట్ గా మారాడు. దూకుడు చిత్రంలోనూ అతన్నే విలన్ గా తీసుకున్నారు. ఇక 'నేను.. నా రాక్షసి' చిత్రాన్ని నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. రీసెంట్ గా పైట్ మాస్టరక్ విజయన్ నేతృత్వంలో...అభిమన్యుసింగ్, ఇలియానా, రాణాపై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వేనిస్, బ్యాంకాక్ లలో పాటల చిత్రీకరణ చేశారు. 95 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయింది. సంక్రాంతి కానుకగా తీసుకురావటానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్ రాథోడ్.


Click it and Unblock the Notifications











