అభిమన్యుడు కలెక్షన్స్: విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్.. లాభాల పంట!
అభిమన్యుడు చిత్రంతో విశాల్ చాలా కాలం తరువాత ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చితం విజయం సాధించగా, ఇటీవల తెలుగులో విడుదలై విజయ ఢంకా మోగించింది. విశాల్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కింది.
ప్రస్తుతం సైబర్ వేదికగా జరుగుతున్న పరిణామాలని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు మిత్రన్ ఈ చిత్రాన్ని తెరక్కించారు. ఈ ఆసక్తికరమైన మూవీకి ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోయారు. ఫలితంగా ఈ చిత్రం తెలుగులో భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమన్యుడు తెలుగు వర్షన్ 12 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. ఫలితంగా బయ్యర్లకు అభిమన్యుడు చిత్రం లాభాల పంట పండించింది. విశాల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అభిమన్యుడు నిలిచింది. తాజగా విడుదలైన కాలా మినహా అభిమన్యుడు చిత్రానికి పోటీగా మరో బలమైన చిత్రం లేదు. కాలా యావరేజ్ టాక్ తో మొదలుకావడం కూడా అభిమన్యుడుకి కలసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. నైజాంలో 4 కోట్లకు పైగా, కృష్ణ ఏరియాలో కోటి, వైజాగ్ కోటిన్నరకు పైగా వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











