మాస్‌ హీరో విశాల్‌ వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌కు 'అభిమన్యుడు' సిద్ధం

By Rajababu

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు.

సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''అభిమన్యుడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

Abhimanyudu will release on May end

తమిళ్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రివ్యూస్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. 'రంగస్థలం', 'మహానటి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సమంతకు 'ఇరుంబుతెరై' హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచింది. తమిళ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

Abhimanyudu will release on May end
మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X