మదారి అంటూ ఇరగదీసిన అచ్చ తెలుగు అభినవకవి

మదారి అంటూ ఇరగదీసిన అచ్చుతెలుగు అభినవకవి పాప్ సాంగ్స్ అంటే చాలు యువత పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. హిప్ హాప్ మ్యూజిక్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ తెలుగులోనూ ఊపందుకుంటోంది. పాప్ రేంజ్ లో కాకపోయినా ప్రైవేట్ సాంగ్స్ కు, జానపద గీతాలకు ఆదరణ పెరుగుతోంది. అయితే, ఈ పాప్ ట్రెండ్ కు తెలుగు సొబగులు అద్ది ఫ్యూజన్ విభాగంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు ప్రణవ్ చాగంటి. తెలుగునాట అభినవ కవిగా పేరుగాంచిన ఈ అచ్చు తెలుగింటి కుర్రాడు మాతృభాషపై మమకారాన్ని రాప్ సాంగ్స్ ద్వారా చాటుకుంటున్నాడు. తాజాగా 'మదారి' అనే పాప్ ఆల్బమ్ విడుదల చేసి మరోసారి వహ్వా అనిపించుకుంటున్నాడు.

 Abhinava Kavi Rocking performance in Madari

మో బోచర్ అనే మరో హైదరాబాదీ రాపర్ తో కలసి ఉర్దూ, తెలుగు మాధ్యమంలో ఓ సరికొత్త ఫ్యూజన్ కు శ్రీకారం చుట్టారు ప్రణవ్. 'మదారీ' పేరిట విడుదలైన ఈ పాప్ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ బ్రహ్మరథం పట్టేస్తున్నారు. మనిషికి, దైవానికి మధ్య సంభాషణ సాగే ఓ సంభాషణకు గమ్మత్తైన దృశ్యరూపం ఇస్తే ఇలానే ఉంటుందేమో అనిపించకమానదు. మో బోచర్, ప్రణవ్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోయగా, సోల్ ఫయా ప్రొడక్షన్స్ స్వరాలు పాటను మరో రేంజ్ కు తీసుకువెళ్లాయి.
సంగీతానికి భాషతో సంబంధంలేదు అని ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పాప్ ఆల్బమ్స్ నిరూపించాయి. ముఖ్యంగా ఈ మధ్య యువత హాట్ ఫేవరేట్ గా మారిన కొరియన్ పాప్ బృందం బీటీఎస్ కు లభిస్తున్న ఆదరణే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ పాట ద్వారా అందమైన కథను చెప్పవచ్చు, ఓ సందేశాన్ని ప్రంపచానికి అందించవచ్చు అని నేటి మ్యుజీషియన్స్ నిరూపిస్తున్నారు. అయితే, సరైన ప్రోత్సాహం లభిస్తే మన వాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పాప్ ఆల్బమ్స్ రూపొందించగలరు అని 'మదారి' ఆల్బమ్ నిరూపిస్తోంది. ఏమైనా ఇదే స్ఫూర్తిలో మన అభినవకవి ప్రణవ్, మో బౌచర్ ముందుకు సాగాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X