ఎన్టీఆర్ చెల్లెలు...కృష్ణుడు లవర్ గా

By Srikanya

దమ్మలో ఎన్టీఆర్ చెల్లెలుగా,శంభో శివ శంభో లో రవితేజ చెల్లెగా చేసిన అభినయ గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుగులో మరో చిత్రంలో బుక్కైంది. కృష్ణుడు ప్రధాన పాత్రలో చేస్తున్న దస్విదానియా రీమేక్ లో ఆమెను తీసుకున్నారు. 2008లో వచ్చిన దస్విదానియా చిత్రం అప్పట్లో బాగా ఆడింది. దాంతో ఈ చిత్రం రైట్స్ తీసుకుని చంద్రుడు పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ప్రేమ, ఉద్వేగం, తల్లి సెంటిమెంట్‌ వంటి అన్ని అంశాలను మేళవించి 'చంద్రుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ చిత్రం 'దస్విదానియా'కి ఇది రీమేక్‌. కృష్ణుడు హీరోగా కల్యాణి హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అభినయ వచ్చి చేరింది. ఇక జయసుధ హీరోకి తల్లి పాత్రలో నటిస్తున్నారు. సత్యనారాయణ ద్వారపూడి దర్శకుడు. శివచంద్ర మల్టీమీడియా సమర్పణలో ఉషా సినీ స్టూడియోస్‌ నిర్మిస్తోంది.

కృష్ణుడు మాట్లాడుతూ, 'దస్విదానియా చిత్రాన్ని 30 సార్లు చూశాను. అన్ని కోణాలున్న చిత్రమిది. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. నేను ఎంతో అభిమానించే సహజనటి జయసుధతో కలసి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని అన్నారు. జయసుధ మాట్లాడుతూ, 'ఇందులో అమ్మ పాత్రను పోషిస్తున్నాను. బాగా ఇష్టపడి చేస్తున్న చిత్రమిది. కృష్ణుడి పాత్ర కూడా ఎంతో బావుంటుంది. మరో వైవిధ్యభరితమైన చిత్రమిది' అని చెప్పగా, 'నేను కూడా ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని కథానాయిక కల్యాణి అన్నారు.

దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ, 'ఇందులోని పాత్ర కృష్ణుడికి ఎంతో బాగా సరిపోతుంది. నేను ఇదివరకు తీసిన 'పెళ్లికాని ప్రసాద్‌'లో జయసుధ నటించారు. మళ్లీ ఆమె ఈ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేస్తున్నాం' అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, వేణుమాధవ్‌, రఘుబాబు, అలీ, సుమన్‌శెట్టి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుణ్‌కుమార్‌, సంగీతం: ఎకోస్ట్రిక్స్‌, ఎడిటింగ్‌: రంగస్వామి, కళ: వెంకటేశ్వరరావు, నిర్మాణ సారథ్యం: త్రినాథ్‌ పెదిరెడ్ల, కథనం, దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X