రానా దగ్గుబాటి తమ్ముడి మొదటి సినిమా.. టైటిల్ ప్రీ లుక్ తోనే షాక్ ఇచ్చాడుగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గర్వించదగ్గ అతి కొద్దిమంది నిర్మాతలలో రామానాయుడు ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన తనయుడు సురేష్ బాబు కూడా మినిమం సక్సెస్ రేటు నిర్మాతగా మంచి విషయాలను అనుకుంటూ వచ్చారు. వీరి తనయుడు రానా దగ్గుబాటి నటుడిగా హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ దగ్గుబాటి సైతం సినిమా ఇండస్ట్రీలో నటుడిగా బిజీ కావడానికి సిద్ధమవుతున్నాడు. అతని మొదటి సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ టైటిల్ ను కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మూడేళ్ల క్రితమే..

మూడేళ్ల క్రితమే..

సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని చాలా కాలంగా ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే మూడేళ్ల క్రితమే అతని మొదటి సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు టాక్ అయితే వచ్చింది. అంతే కాకుండా కొన్ని కాంట్రవర్సీలలో చిక్కుకోవడం కూడా అతని కెరీర్ స్టార్ట్ కావడానికి ఆలస్యం అయ్యింది

హీరోగా నిలదొక్కుకోవడానికి..

హీరోగా నిలదొక్కుకోవడానికి..

ఏదేమైనా కూడా అభిరామ్ దగ్గుబాటి కూడా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఐదేళ్ల క్రితం యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. అనంతరం తన కొడుకు కోసం సురేష్ బాబు ఎన్నో కథల పై చర్చలు జరిపాడు. రెండు మూడు కథలను వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

తేజ దర్శకత్వంలో..

తేజ దర్శకత్వంలో..

ఇక ఫైనల్ గా తేజ దర్శకత్వంలోనే అభిరామ్ దగ్గుపాటి మొదటి సినిమాను తీసుకురాబోతున్నారు. దర్శకుడు తేజ సురేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ లో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత తేజ దర్శకత్వంలోనే అభిరామ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కూడా ఇచ్చాడు.

అహింసా..

అహింసా..

అయితే వీరి కలయికలో వస్తున్న మొదటి సినిమా రిలీజ్ పోస్టర్ అలాగే టైటిల్ ను కూడా విడుదల చేశారు. ప్రిన్సిపల్ షూటింగ్ అయితే పూర్తి అయింది అంటూ అభిరామ్ దగ్గుబాటి మొహాన్ని ఒక గోనే సంచీ బట్టతో చుట్టినట్లు గా ఉంది. ఇక అతన్ని బాగా కొట్టినట్లు కూడా ఉంది. చూస్తుంటే సినిమా చాలా వైల్డ్ గా ఉండే అవకాశం ఉంది. సినిమాకు అహింసా టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో..

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో..

దర్శకుడు తేజ గత కొంత కాలంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కంటెంట్ ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అహింస అనే ప్రాజెక్టు కూడా అదే తరహాలో తెరపైకి రాబోతున్నట్లు సమాచారం. అహింసా సినిమాలో అభిరామ్ దగ్గుబాటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి మొదటి సినిమాతో ఈ హీరో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ లో కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X