Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దగ్గుబాటి అభిరామ్ కారు యాక్సిడెంట్.. గందరగోళంపై క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ, జబర్దస్త్ అభీ
హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన ఓ ప్రమాదం టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించినదే వార్త సినీ వర్గాల్లో విపరీతమైన గందరగోళానికి దారి తీసింది. అయితే కారు ప్రమాదంలో దగ్గుబాటి అభిరామ్, ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి అంటగడుతూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో ముందుగా అదిరే అభి, ఆ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ మీడియాకు వివరణ ఇచ్చారు. అభి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంపై ఏం చెప్పారంటే..
అభిరామ్ కారు ప్రమాదంపై ఫ్యామిలీ రియాక్షన్
రానా సోదరుడు, నిర్మాత సురేష్ కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఆయన కారు బోల్తా పడింది అనే వార్త వెబ్, సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఆ వార్తలో వాస్తవం లేదు అని అభిరామ్ కుటుంబసభ్యులు ఖండించారు.
వదంతులను నమ్మొద్దు
దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదం ఓ వదంతి మాత్రమే, ప్రమాదానికి గురైన కారుతో దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధం లేదు. మీడియాలో వస్తున్న వార్తలకు , అభిరామ్‌కు ఎలాంటి సంబంధం లేదు అని దగ్గుబాటి ఫ్యామిలీ స్పష్టం చేసింది. కారు ప్రమాదం వార్తను ప్రచురించవద్దు, దయచేసి వదంతులను నమ్మవద్దు, వాటిని ప్రచారం చేయవద్దు అని దగ్గుబాటి ఫ్యామిలీ ఓ ప్రకటనలో కోరారు.
జబర్దస్త్ అభీ కారుకు ప్రమాదం
ఇదిలా ఉండగా, జబర్దస్త్ ఫేం అదిరే అభి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అభి కారు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. అభిపై మరో వాహనదారుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎదుటే ఇరువురు గొడవ పడ్డారు. వాహనదారు ఫిర్యాదుతో అభిని విచారిస్తున్నారు అనే వార్త మీడియాలో వెలుగు చూసింది.
Recommended Video
ప్రమాదంతో నాకు సంబంధం లేదు.. అందంతా ఫేక్ న్యూస్
తనకు సంబంధించిన కారు ప్రమాదం వార్త మీడియాలో వైరల్ అవుతుండంటంతో అదిరే అభి తన వాట్సప్ స్టేటస్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మణికొండలో నా కారు యాక్సిడెంట్‌కు గురైందనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. అది ఫేక్ న్యూస్. అందులో వాస్తవం లేదు. ఆ కారు ప్రమాదానికి నాకు సంబంధం లేదు అని అభి వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రమాదానికి గురైన కారు ఎవరిదనే విషయం ప్రశ్నగా మారింది.