ఉచితంగా 10000 ఆదిపురుష్ టికెట్లు.. మానవత్వం చూపిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఫ్రీగా సినిమా చూడాలంటే?
సినీ చరిత్రలో ఆదిపురుష్ సినిమాను చిరకాలం గుర్తుంచుకొనేలా చేయడానికి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సినీ ప్రముఖులు ఒక్కటవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి రకరకాల మార్కెటింగ్ స్ట్రాటెజీలు, ప్రమోషనల్ వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. అయితే కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమా చూపించే విషయంలో మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆదిపురుష్ సినిమాకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. జై శ్రీరామ్ అంటూ భక్తిభావాన్ని సినీ ప్రేక్షకుల ప్రదర్శిస్తున్నారు. రాముడి జీవితాన్ని వెండితెర మీద చూసేందుకు నేటి తరం ఉత్సాహంగా ఉంది. అయితే ఈ సినిమాను, రాముడి జీవిత చరిత్రను అన్నివర్గాల ప్రేక్షకులు తెలియజేసేలా అభిషేక్ అగర్వాల్ నిర్ణయం తీసుకొన్నారు.

రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేశ్వరుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమాను తెలంగాణలోని వృద్దాప్య గృహాల్లోని వారికి, అనాథ పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సినిమాను ఉచితంగా చూపించాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్ణయం తీసుకొన్నారు. ఇందు కోసం ఆయన 10 వేలకుపైగా టికెట్లను ఉచితంగా అందించనున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేశారు.

అభిషేక్ అగర్వాల్ తన ప్రకటనలో.. ప్రస్తుత జూన్ మాసాన్ని పండుగలా జరుపుకోవడమే కాకుండా ఓ ఉన్నత లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నించాలి. మర్యాద పురుషోత్తం జీవితాన్ని సెలబ్రేట్ చేసుకొందాం. ఆదిపురుష్‌ను మనం పండగలా సెలబ్రేట్ చేసుకొందాం. ప్రతీ మానవుడికి శ్రీ రామచంద్ర ప్రభువు జీవితం ఓ పాఠం లాంటింది. ఈ తరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన జీవిత సారాన్ని తెలుసుకోవాలి అని అన్నారు.
సినిమా పరిశ్రమలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆదిపురుష్ సినిమాను ఉచితంగా చూపించాలని అనుకొంటున్నాం. తెలంగాణలో 10 వేలకుపైగా టికెట్లను అందించాలని నిర్ణయం తీసుకొన్నాం. ఆదిపురుష్ సినిమాను ఉచితంగా చూడాలనుకొనే అనాథలు, వృద్దాశ్రమంలో ఉండే వృద్ధులు, ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు 9505034567 ఫోన్ నంబర్‌కు గానీ.. లేదా [email protected] అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించి టికెట్లు పొందవచ్చు అని అభిషేక్ అగర్వాల్ తన ప్రకటనలో తెలిపారు. ఫ్రీగా టికెట్లు పొందడానికి గూగుల్ డాక్‌లో వివరాలు పొందుపరిచాల్సి ఉంటుంది.
ఆర్థికంగా వెనుకబడి ఉండి.. సినిమాను థియేటర్లలో చూడలేని వారికి ఈ సాయం చేయాలని నిర్ణయించుకొన్న అభిషేక్ అగర్వాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ విషయానికి వస్తే.. ది కశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ 2 సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు. ఓం రావత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











