ఐశ్వర్య కూతురు పేరు ‘K’అక్షరంతో..
అందాల తార ఐశ్వర్య రాయ్ మరో అందాల బేబీకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఐశ్వర్య బిడ్డకు జన్మిచ్చిందే ఆలస్యం ఆమెకు ఏ పేరు పెడితే...ఆ చిన్నారి భవిష్యత్ బాగుటుంది? ఏ అక్షరంతో ఆమె పేరు మొదలు పెడితే ఈ బుల్లి ఐశ్వర్య మరో అందాల తారాగా మారగలదు? అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ మేరకు న్యూమరాలజిస్టులు, జ్యోతిష్యులు లెక్కలు కూడా వేయడం మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిష్యలు, న్యూమరాలజిస్టుల నుంచి వినిపస్తున్న దాని ప్రకారం..... ఆ చిన్నా పుట్టిన తేదీ, సమయం, రాశి, నక్షత్రం ప్రకారం 'K" అనే అక్షరంతో ఐశ్వర్య కూతురు మొదలయితే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
ఆ బేబీ పుట్టిన తేదీ 16 కాబట్టి 1+6 = నెంబర్ 7(కెతు) ఇది నెంబర్ 2(చంద్రుడు)ను పాలిస్తుంది. ఆమె రాశి వృశ్చికం నెం.9(అంగాకరుడు). ఆమె అదృష్ట సంఖ్య 4(రాహు).....ఈ లెక్క ప్రకారం ఐశ్వర్య కూరుతు పేరు 'K" అనే అక్షరంతో మొదలయితే ఆ బేబీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది అంటున్నారు.
బచ్చన్ కుటుంబ సభ్యలైన అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య ఇలా వీరి పేర్లు...'A"అనే అక్షరంతో మొదలయ్యాయి కాబట్టి ఆమె కూతురు పేరు కూడా అదే అక్షరంతో మొదలవుతుందని అభిమానులు ఇంతకాలం భావించారు. అయితే తాజాగా ఆమె జన్మనామం 'K" అనే అక్షరంతో మొదలవుతుండటంతో అందరి అంచనాలు తల క్రిందులయ్యాయి.


Click it and Unblock the Notifications











