'లే.. లేకపోతే చస్తావు' అని ఐశ్వర్య అరిచి...
షూటింగ్ గ్యాప్ లో నేను సమీపంలోని రాతి బండలు లేదా చెట్ల పొదల్లో పడుకుని విశ్రాంతి తీసుకునేవాడిని. ఓ రోజు నేను రాయిపై పడుకుని ఉండగా..వారు గట్టిగా అరవడం విన్నాను. వెంటనే అక్కడ నుంచి లే..లేకపోతే చస్తావు అని వారు అరిచారు. తీరా లేచి చూస్తే..తొమ్మిదడుగుల పాము నా వైపు వస్తూ కనిపించింది. ఈ రోజు రవికిషన్ మీ ముందు ఉన్నాడంటే అందుకు కారణం..ఆ జంటే' అని అభిషేక్, ఐశ్వర్యలుపై ప్రశంసలు భోజ్ పురీ సూపర్ స్టార్ రవికిషన్ కురిపించారు. 'రావణ్' చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు..ఓ పాము నుంచి తనను కాపాడారని ఆయన చెప్పారు. అభిషేక్, ఐశ్వర్యలు తన ప్రాణాన్ని కాపాడారని రవికిషన్ చెప్పారు. ముఖ్యంగా ఐశ్వర్య రాయ్ తనను అలా హెచ్చరించబట్టే తాను సేవ్ అయ్యాయని చెప్పుకొచ్చారు.
అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ రవికిషన్ భోజపురి రావణ్ abhishek bachchan aishwarya rai ravi kishan bhojapuri ravan maniratnam


Click it and Unblock the Notifications