twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏంటి.. అభిషేక్ బచ్చన్ కూడా అవకాశాల కోసం అడుక్కున్నాడట..

    |

    సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్ పాయింట్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే ఫ్యామిలీకి చెందిన నటీనటుల సంఖ్య వందల సంఖ్యలో ఉంది. దీంతో నెపోటీజమ్ అనే కామెంట్స్ ఆ ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చలా మారింది. సుశాంత్ సింగ్ సూసైడ్ కారణంగా నెపోటీజమ్ డోస్ ఇంకా పెరిగిందనే చెప్పాలి.

     బ్యాక్ గ్రౌండ్ ఉంటే..

    బ్యాక్ గ్రౌండ్ ఉంటే..

    అయితే సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అవుతారని గ్యారెంటీ లేదు. మొదట్లో సపోర్ట్ బాగానే పనికొచ్చినా కూడా ఆ తరువాత సొంతంగా ఎదగకపోతే కెరీర్ క్లోజ్ అయినట్లే. ఇక అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ తనయుడు అభిషేక్ బచ్చన్ అందుకు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. కేవలం అమితాబ్ అనే బ్రాండ్ తోనే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

     అభిషేక్ ఏం సాధించాడు..

    అభిషేక్ ఏం సాధించాడు..

    అమితాబ్ బచ్చన్ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా హిస్టరిలో ఎవరు అందుకోలేని విదంగా ఒక చరిత్ర సృష్టించాడు. అలాంటి హీరో కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉండాలి. కానీ అభిషేక్ మాత్రం కొంచెం కూడా నటనలో గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. 20ఏళ్లయినా కొంచెం కూడా క్లిక్కవ్వడం లేదు. ధూమ్ సిరీస్, చిన్న చిన్న హిట్స్ తప్పితే.. తన స్థాయిని పెంచే సోలో సక్సెస్ అయితే అందుకోలేదు.

     ఎంత అడుక్కున్నా..

    ఎంత అడుక్కున్నా..

    అయితే కెరీర్ మొదట్లో మాత్రం తండ్రి సాయంతో అతను ఛాన్సులు అందుకోలేదట. మొదటి అవకాశం కోసం చాలా మంది నిర్మాతలను అడుక్కున్నట్లు అభిషేక్ తెలిపాడు. ఎంతమందిని కలిసినా కూడా అభిషేక్ ని హీరోగా పరిచయం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట. కొంతమంది ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి చివరి నిమిషంలో చేయలేమని మొహం మీదే చెప్పారట.

    Recommended Video

    Nepotism: Abhishek Bachchan అవకాశాల కోసం అడుక్కున్నాడట.. అంటే Bollywood లో Nepotism లేదా ?
    అభిషేక్ @20..

    అభిషేక్ @20..

    చివరికి జేపీ దత్త నిర్మాతగా రెవ్యూజీ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినట్లు అభిషేక్ తెలిపాడు. అభిషేక్ 20ఏళ్ల కెరీర్ సందర్భంగా రోడ్ టు 20 పేరుతో ఒక స్పెషల్ కార్యక్రమంతో తన జీవితంలోని విశేషాలను బయటపెడుతున్నాడు. సుశాంత్ సూసైడ్ కారణంగా నెపోటీజమ్ న్యూస్ వైరల్ అవుతున్న సమయంలో అభిషేక్ ఈ విధంగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    However, there is no guarantee that the film industry will succeed as much as the background. Even if the support is good at the beginning, then it is a career close. Amitabh Bachchan's son Abhishek Bachchan is an example. He is still in the industry with a brand called Amitabh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X